● రెండు మూడు బంకులకు వెళ్తున్నా.. | - | Sakshi
Sakshi News home page

● రెండు మూడు బంకులకు వెళ్తున్నా..

Apr 28 2026 8:11 AM | Updated on Apr 28 2026 8:11 AM

కపిలేశ్వరపురం మండలంలోని బంకుల వద్ద డీజిల్‌ లభ్యత పరిమితంగా ఉంది. నాది పెట్రోలు వాహనం కావడంతో దగ్గర, దూరపు కిరాయిలకు నడుపుతున్నాను. బంక్‌లో రూ.500కు మాత్రమే పెట్రోలు పోస్తున్నారు. లీటరుకు 15 కిలోమీటర్లు మైలేజీ వస్తుంది. దీంతో, నా ట్యాక్సీపై రూ.500 పెట్రోలుతో 70 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించడం సాధ్యమవుతుంది. చేసేది లేక రెండు మూడు బంకుల్లో రూ.500 చొప్పున పెట్రోలు కొట్టిస్తున్నాను.

– ఆచంట సుబ్బారావు, ట్యాక్సీ డ్రైవర్‌, వెదురుమూడి, కపిలేశ్వరపురం మండలం

మూడు రోజులుగా డీజిల్‌ లేదు

మూడు రోజుల నుంచి డీజిల్‌ దొరకడం లేదు. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి లేదు. మొన్నటి వరకూ యుద్ధం జరిగినా అప్పుడు బాగానే డీజిల్‌ కొట్టారు. ఈసారి మాత్రం డీజిల్‌ లేదని చెప్పేస్తున్నారు. నో స్టాక్‌ బోర్డులు మాత్రం పెట్టడం లేదు. ప్రభుత్వం పట్టించుకుని డీజిల్‌ దొరికేలా చర్యలు తీసుకోవాలి. లేదంటే ఆటో కార్మికుల జీవితాలు దుర్భరంగా మారతాయి.

– మోహన్‌ కుమార్‌,

ఆటో డ్రైవర్‌, డి.ముప్పవరం, నిడదవోలు మండలం

Advertisement
 
Advertisement
Advertisement