గతంలో మార్కెట్‌లో ధరలు బాగున్నప్పుడు వేయి కాయలకు రూ.20 నుంచి రూ.22 వేలు ఇచ్చేవారు. నేడు అదే కాయలకు రూ.8 వేలే ఇస్తున్నారు.
– వాకలపూడి సూర్యారావు, రైతు, కానూరు
అయిన కాడికి అమ్ముతున్నాం
వ్యాపారస్తుడు చెప్పిన ధరకు అమ్ముతున్నాం. ఎక్కడికై నా వెళ్లి అమ్ముదామంటే అయిన కాడికి అడుగుతున్నారు. ఎందుకొచ్చిన గొడవ అనుకుని ఇచ్చింది తీసుకుంటున్నాం.
– కంటిపూడి సూర్యనారాయణ, రైతు, తీపర్రు
కొనుగోలు చేయడం లేదు
ఎప్పుడు ఏ ధర ఉంటుందో తెలియటం లేదు. అందుకే కొనుగోలు చేయటం లేదు.
– గొల్లకొటి వెర్రిబాబు,
కొబ్బరి వ్యాపారి ఖండవల్లి


