అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి నియామకానికి రంగం సిద్ధమైంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. అన్నవరం దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త ఐవీ రోహిత్ ఛైర్మన్‌గా, మరో 16 మంది సభ్యులతో ట్రస్ట్‌బోర్డును నియమిస్తూ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై రెండు రోజుల్లో జీఓ విడుదల కానుందని సమాచారం. నూతన ట్రస్ట్‌బోర్డులో టీడీపీకి చెందిన రావిపాటి సత్యనారాయణ (గుంటూరు వెస్ట్), పర్వత సూర్యారావు (సురేష్), ధనేకుల సూర్య భాస్కరం, (ప్రత్తిపాడు), పాలచర్ల నాగేంద్రబాబు (జగ్గంపేట), తూము అప్పారావు (పిఠాపురం), ఎస్సీ వర్గానికి చెందిన హెచ్.రామాంజనేయులు (మడకశిర), తేలుగుట్ల అనాథమ్మ (ఒంగోలు), ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన గోదేటి భగవత్ (రంపచోడవరం), రెడ్డి ఎరుకమ్మ (మాడుగుల), ఇముడుగపల్లి లోవకుమారి (తుని), యరగడపు బాబ్జీ (మండపేట), బండి లక్ష్మి (కై కలూరు), తుల్లిమిల్లి ఝాన్సీలక్ష్మి (గన్నవరం – కృష్ణా జిల్లా) ఉన్నారు. జనసేనకు చెందిన గెడ్డం అప్పారావు (బుజ్జి) (ఎస్సీ) (పాయకరావుపేట), తోలేటి శిరీష (పిఠాపురం), బీజేపీకి చెందిన కామర్స్ చిరంజీవి (అన్నవరం) నియమితులయ్యారు.
గత ప్రభుత్వ ఫార్ములా కాపీ
రాష్ట్రంలో టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా దేవస్థానం ట్రస్ట్‌బోర్డులో ఒకరిద్దరు మహిళలను తప్ప నియమించేవారు కాదు. 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక 16 మంది సభ్యులతో ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు చేసినప్పుడు ఏడుగురు మహిళలను సభ్యులుగా నియమించారు. ఆ ఫార్ములాను టీడీపీ కాపీ కొట్టి, ఇప్పుడు ఆరుగురు మహిళలను సభ్యులుగా నియమించింది.
దాతలకేదీ అవకాశం?
దేవస్థానానికి రూ.కోట్ల విరాళాలు సమర్పించిన దాతలను గతంలో ట్రస్ట్‌బోర్డు సభ్యులుగా నియమించేవారు. తాజా ట్రస్ట్‌బోర్డు నియామకంలో ఒక్క దాత కూడా లేకపోవడం గమనార్హం.
ఫ వ్యవస్థాపక ధర్మకర్త అధ్యక్షతన
16 మందితో ఏర్పాటు
ఫ త్వరలో జీఓ!


