కాసులకే కూటమి నాయకుల ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

కాసులకే కూటమి నాయకుల ప్రాధాన్యం

Mar 25 2026 7:14 AM | Updated on Mar 25 2026 7:14 AM

కాసులకే కూటమి నాయకుల ప్రాధాన్యం

కడియం: కాసులు కూడబెట్టుకునేందుకే కూటమి నాయకులు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, గోదావరి లంకల్లో జరుగుతున్న మట్టి అక్రమ తవ్వకాలే దీనికి నిదర్శమని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కడియం మండలం వీరవరం రెవెన్యూ పరిధిలోని గోదావరి లంకల్లో సర్వే నెం.147లో మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని మంగళవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వంలో నాయకులు.. సొమ్ములను కూడబెట్టుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారన్నారు. అధికారులను ప్రలోభపెట్టో, భయపెట్టో, వారితో నిరంకుశంగా వ్యవహరించో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారన్నారు. పదే పదే మీడియాలో వైఎస్సార్‌ సీపీ ఈ విషయాన్ని తెలియజేస్తూనే ఉందన్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రాతినిధ్యం వహిస్తున్న రూరల్‌ నియోజకవర్గంలో ఒక భారీ అవినీతి కార్యక్రమం ఇక్కడ జరుగుతోందన్నారు. పూలతోటలు సాగు చేసే భూములకు పక్కనే గోదావరి లంకల్లో మట్టిని అక్రమంగా తవ్వేస్తున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రిగా ఉన్న పవన్‌ కల్యాణ్‌, ఇప్పుడు మంత్రిగా ఉన్న కందుల దుర్గేష్‌ 2022లో ఇక్కడ తవ్వకాలు జరుగుతుంటే చాలా హడావుడి చేశారని గుర్తు చేశారు.లంకల్లో మట్టి తవ్వితే ఆ గోతుల్లో జింకలు పడి చచ్చిపోతాయని, పర్యావరణానికి తీరని నష్టం ఆందోళనకు దిగారన్నారు. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో మట్టి దోపిడీ జరుగుతుంటే వారిద్దరూ ఏమైపోయారో అర్థం కావడం లేదన్నారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరికి కూడా గతంలో ఈ నియోజకవర్గంలో జరిగే అక్రమాలను ఆయన దృష్టికి తానే స్వయంగా తీసుకువచ్చానన్నారు. కానీ ఆయన స్పందించడం లేదన్నారు.

నిబంధనలకు విరుద్ధం

వేణు మాట్లాడుతూ అధికారులు అనుమతులిచ్చిన భూములకు మూడు బ్యాంకుల్లో లోన్లు తెచ్చారన్నారు. ఆ రుణాలు తీర్చకపోవడంతో బ్యాంకర్లు ట్రిబ్యునల్‌కు వెళ్లారన్నారు. అక్కడ తీర్పు పెండింగ్‌లో ఉండగా సదరు భూముల్లో అక్రమ తవ్వకాలు చేస్తున్నారు. రూ.2 వేలకు బిల్లు ఇచ్చి రూ.9 వేల నుంచి రూ.12 వేలకు మట్టి అమ్ముతున్నారన్నారు. నదీ గర్భంలో మట్టి తీయడం వాల్టా చట్టానికి వ్యతిరేకమని, అసలు ఈ రాష్ట్రంలో చట్టం అమలులో ఉందా? లేదా? అన్న అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై ఏ ఒక్క అధికారి పర్యవేక్షణ లేదన్నారు. మట్టి తవ్వకాల కారణంగా వరదల సమయంలో పక్కనే ఉన్న తమ పొలాలు కూడా కోతకు గురవుతాయని సమీప రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ అక్రమ తవ్వకాలకు కలెక్టర్‌, మైన్స్‌, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు అందరూ బాధ్యత వహించాలని వేణు అన్నారు. ప్రతి దానికీ స్పందించే బుచ్చయ్య.. ఇక్కడ జరిగే తప్పులపై ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. ఇప్పటికే కూటమి ప్రభు త్వం పనితీరు కారణంగా పోలవరం ప్రాజెక్టులో రూ.వెయ్యి కోట్ల ప్రజల సొమ్ము గంగపాలు చేశారని, ప్రస్తుతం తవ్వకాలు జరుగుతున్న భూముల్లో అనుమతులు ఏ ప్రాతిపదికన ఇచ్చారన్న దానిపై కలెక్టర్‌ సమగ్ర విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలన్నారు. కాగా.. వైఎస్సార్‌ సీపీ నాయకుల పరిశీలన నేపథ్యంలో అక్రమ తవ్వకాలను నిలిపివేసి, యంత్రాలు, లారీలను అక్కడి నుంచి తరలించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల వీర్రాజు, మండల అధ్యక్షుడు యాదల సతీష్‌చంద్ర స్టాలిన్‌, నాయకులు ఈలి గోపాలం, తాడాల విష్ణుచక్రవర్తి, కొత్తపల్లి శివాజీ, బోడపాటి సత్య నారాయణ, తిరుమలశెట్టి శ్రీనువాసు, కొత్తపల్లి మూర్తి, గాద రామకృష్ణ, సింగంశెట్టి శ్రీను, మార్గాని బలరాం, రత్నం కృష్ణ, తిరుకోటి నాగేశ్వరరావు, సాకా కిరణ్‌కుమార్‌, నరమామిడి బాలరాజు, ఈలి కొండబాబు, ఎంపీటీసీ ఆకుల సుధాకర్‌ పాల్గొన్నారు.

·˘ ÌS…MýSÌZÏ Ð]l$sìæt A{MýSÐ]l$ ™èlÐ]lÓ-M>Ìôæ

దానికి నిదర్శనం

·˘ OÐðlG-ÝëÞÆŠ‡ ïÜï³ hÌêÏ A«§ýlÅ-„ýS$yýl$,

మాజీ మంత్రి వేణు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement