నా ఇంటిపై దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా పోరాడతా | - | Sakshi
Sakshi News home page

నా ఇంటిపై దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా పోరాడతా

Mar 26 2026 7:47 AM | Updated on Mar 26 2026 7:47 AM

మాజీ మంత్రి అంబటి రాంబాబు

రాజమహేంద్రవరం సిటీ: నా ఇంటిపై దాడి చేసి, వాహనాలను తగులు పెట్టిన వారిపై ప్రభుత్వం ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని, వారికి శిక్ష పడేదాకా పోరాడుతానని రాష్ట్ర మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. బుధవారం రాజమహేంద్రవరంలోని శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి నక్కా నగేష్‌ను పరామర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం తనపై అత్యంత కక్షపూరితంగా వ్యవహరించిందన్నారు. రాష్ట్రంలో40 శాతం ఓట్లు ఉన్న పార్టీలో, 20 శాతం జనాభా ఉన్న సామాజిక వర్గంలో నేను ఒక నాయకుడినన్నారు. ప్రభుత్వం అక్రమంగా నన్ను జైల్లో పెట్టిన సమయంలో తూర్పు గోదావరి జిల్లాలో ఎంతోమంది నాకు అండగా నిలిచారన్నారు. వారందరినీ కలిసి కృతజ్ఞత చెప్పేందుకు గోదావరి జిల్లాకు వచ్చానన్నారు. ఆయన వెంట వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఉన్నారు.

ఆర్‌ఆర్‌ఆర్‌, ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌కు

సహకారం

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఆర్‌ఆర్‌ఆర్‌, ఫ్లడ్‌ మేనేజ్‌మెంట్‌ పనులకు సహకరిస్తామని కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్‌ కాంతారావు అన్నారు. బుధవారం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చిన ఆయనను రాజమహేంద్రవరంలోని ఒక హాటల్‌లో రాష్ట్ర జలవనరుల శాఖామంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. ప్రాజెక్టు పెండింగ్‌ డిజైన్లకు అనుమతులు వచ్చేలా సహకరించాలని కోరారు. గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార, నాగావళి ఏటి గట్ల పటిష్టతకు సహకరించాలన్నారు. కాంతారావును కలెక్టర్‌ కలెక్టర్‌ కీర్తి మర్యాద పూర్వకంగా కలిశారు.

28న జాబ్‌మేళా

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): పభుత్వ ఆర్ట్స్‌ కళాశాలలో ఈ నెల 28న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రామచంద్ర ఆర్‌కే బుధవారం తెలిపారు. డిగ్రీ, పీజీ పాసైన, ప్రస్తుతం ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థులకు 30 కంపెనీలతో జాబ్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు. అర్హత గల విద్యార్థులు ఉదయం 9 గంటలకు తమ బయోడేటా, సరిఫికెట్లతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు కళాశాల జేకేసీ విభాగంలో సంప్రదించవచ్చన్నారు.

నిందితులను

వదిలే ప్రసక్తి లేదు

మానవ హక్కుల చైర్‌పర్సన్‌ శైలజ

తుని: మానవ సమాజం తలదించుకునే విధంగా గిరిజన దివ్యాంగురాలిపై లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేసేందుకు ప్రయత్నించిన నిందితులకు చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ అన్నారు. బుధవారం తునిలోని ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన దివ్యాంగురాలిని శైలజ పరామర్శించారు. లైంగికదాడిలో గాయపడిన దివ్యాంగురాలి ఆరోగ్య పరిస్థితిని న్యూరో వైద్యుడు గురుప్రసాద్‌ను అడిగి తెలుసుకున్నారు. వైద్యానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం తరఫున అందిస్తామని కుటుంబ సభ్యులకు చెప్పారు. అనంతరం మీడియా సమావేశంలో శైలజ మాట్లాడుతూ ఈ నెల 18న కోటనందూరు మండలం పాత కొట్టాం పంచాయతీ పరిధిలోని సంగవాకలో గిరిజన దివ్యాంగురాలు బహిర్భూమికి వెళ్లిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు లైంగిక దాడిచేసి, ఆపై హత్యాయత్నం చేశారన్నారు. తలకు గాయం కావడంతో ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారని చెప్పారు. ప్రాథమిక సమాచారం మేరకు బాలుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారని, పోలీస్‌శాఖ లోతుగా విచారణ జరిపి అసలు నిందితులను పట్టుకోవాలని సూచించారు. అఘాత్యానికి పాల్పడినది ఎవరైనా కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement