రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబు ప్రభుత్వంలో క్రైస్తవులకు రక్షణ కరవైందని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్ వెస్లీ అన్నారు. కొంతమూరులోని ఎంవీఎస్ ఫంక్షన్ హాల్లో వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్య క్షుడు విజయసారథి ఆధ్వర్యంలో మంగళవారం పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతి సందర్భంగా క్రైస్తవ సభ నిర్వహించారు. జాన్‌వెస్లీతో పాటు వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, రా ష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జాన్ వెస్లీ, రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రవణ్ కుమార్, ఉప కార్యదర్శి వై.రాజా, తూ ర్పుగోదావరి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు తరలివచ్చి.. పాస్టర్ ప్రవీణ్ పగడాల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎంపీ భరత్‌రామ్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుంచీ క్రైస్తవులను అణగతొక్కాలనే చూస్తోందన్నారు. రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తండ్రి అప్పారావు ఇటీవల దళితుడైన జాన్‌ను చంపేస్తానని, లేపేస్తానని దుర్భాషలాడిన విషయం అందరికీ తెలుసునన్నారు. జిల్లా అధ్యక్షుడు మారేళ్లపూడి విజయసారథి మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రథమ వర్ధంతి సందర్భంగా రాష్ట్రంలో ఈ రోజును క్రైస్తవ ఐక్యత దినంగా పాటించబోతున్నామన్నారు.
ఫ వైఎస్సార్ సీపీ క్రిస్టియన్
మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ
ఫ పాస్టర్ ప్రవీణ్ పగడాల వర్ధంతి సభ
ఫ పాల్గొన్న మాజీ ఎంపీ భరత్‌రామ్


