జీజీహెచ్‌లో అభద్రత నిజమే | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో అభద్రత నిజమే

Mar 24 2026 7:56 AM | Updated on Mar 24 2026 7:56 AM

రాష్ట్ర డీఎంఈ ఆదేశాలతో ఆసుపత్రి అధికారుల వివరణ

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి భద్రతలో లోపాలు నిజమే. సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ అసమర్థత వల్లే చోరీలు, భద్రతా వైఫల్యం నెలకొంది. తగినంత మంది సిబ్బంది లేరు, ఉన్న వారిలోనూ సమర్థుల కొరత. వైద్యుల కూడా దాడులు జరుగుతున్నాయి. వాహనాలు, రోగుల విలువైన వస్తువుల చోరీలు నిత్యకృత్యమైపోయాయి. ఇదీ.. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి అధికారులు రాష్ట్ర డీఎంఈ డాక్టర్‌ రఘునందన్‌ గంభీర, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరిలకు సమర్పించిన లిఖితపూర్వక వివరణ. ఈ నెల 21న సాక్షి దినపత్రికలో ‘భద్రతకు సుస్తీ’ పేరుతో ప్రచురించిన కథనం అక్షర సత్యమైంది. డీఎంఈ రఘునందన్‌ ఈ కథనంపై స్పందించి వివరణ కోరారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టిన జీజీహెచ్‌ ఉన్నతాధికారులు కథనంలోని లోపాలను ధృవీకరించారు. 83 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉండాల్సిన చోట కేవలం 60 మందితో నడిపిస్తున్నారని, ఆస్పత్రి సామగ్రి కూడా చోరీకి గురవుతోందని, సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ అసమర్థత భద్రతను బలహీనం చేసిందని వివరణలో నిర్థారించారు. ఎంవోయూ ప్రకారం శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్‌ నిబంధనలు అనుసరించడం లేదని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆస్పత్రిలో కొంత భాగం నిర్మాణంలో ఉండగా, భద్రతను పటిష్టం చేసేందుకు ఆసుపత్రి వెనుక భాగంలో కనీసం గోడ కూడా కట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని కాంట్రాక్టు సంస్థపై డీఎంఈ, కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. 10 రోజుల లోపు మిగిలిన 23 మంది సెక్యూరిటీ గార్డులను నియమించి, అలాగే ఇప్పటికే కొనసాగుతున్న వారిలో అసమర్థులను తక్షణమే తొలగించి వారి స్థానంలో నిబంధనల మేరకు నియామకాలు చేపట్టి తదుపరి చర్యలు తీసుకోవడానికి వెనకాడబోమని పేర్కొంటూ కాంట్రాక్టు సంస్థకు నోటీసులు జారీ చేసినట్టు వివరణలో పేర్కొన్నారు. సమర్థులు, అర్హులకే నియామకాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులకు తెలిపారు. ఆసుపత్రి అధికారులు సోమవారం ఈ వివరణను డీఎంఈ, కలెక్టర్లకు సమర్పించారు.

ఆర్డీవో బాధ్యతల స్వీకరణ

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం నూతన రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ (ఆర్డీవో)గా ఆర్‌. శివరాముడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టరేట్‌లో జేసీ మేఘాస్వరూప్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓను జేసీ అభినందించారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కా రంలో తనదైన ముద్ర వేయాలని సూచించారు. శివ రాముడు 2007లో అనంతపురం జిల్లాలోని పెద్దవడుగూరు మండలంలో డిప్యూటీ తహసీల్దార్‌గా ఏపీ పబ్లి క్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా తొలి నియామకం పొందా రు. అనంతరం పదోన్నతిపై తహసీల్దార్‌గా బాధ్యత లు నిర్వర్తించారు. తహసీల్దార్‌గా బేతంచర్ల, డోన్‌, ఆ దోని ప్రాంతాలతో పాటు కర్నూలు కలెక్టరేట్‌లో కూడా వివిధ హోదాల్లో సేవలందించారు. అలాగే కలెక్టర్‌ ఏవోగా, భూ సేకరణ విభాగాల్లో కూడా పని చేసి విశేష అనుభవం సంపాదించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ లు, పలువురు జిల్లా అధికారులు, రెవెన్యూ అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement