బీసీల అభ్యున్నతికి దొమ్మేటి విశేష కృషి | - | Sakshi
Sakshi News home page

బీసీల అభ్యున్నతికి దొమ్మేటి విశేష కృషి

Mar 24 2026 7:56 AM | Updated on Mar 24 2026 7:56 AM

వెంకటరెడ్డి జయంతి వేడుకలో వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన

రాజమహేంద్రవరం రూరల్‌: బీసీ ఉపకులాల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడిన మహోన్నత వ్యక్తి దొమ్మేటి వెంకటరెడ్డి అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కొనియాడారు. సోమవారం బొమ్మూరులోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి 173వ జయంతిని ఆయన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దొమ్మేటి చిత్రపటానికి వేణు నివాళులర్పించి మాట్లాడారు. అందరూ ఐక్యతతో ముందుకు సాగాలని చాటి చెప్పిన వ్యక్తి వెంకటరెడ్డి అన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరం పాటుపడాలన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యకు దూరమైన బడుగు బలహీన వర్గాల పిల్లలకు పాఠశాల వద్దే భోజనం ఏర్పాటు చేసి విద్యను అందించిన విద్యాదాత దొమ్మేటిని స్మరించుకుంటూ, ఆయన చేసిన అనేక సేవలను గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యద ర్శి గిరజాల బాబు, మాజీ ఎంపీపీ రేలంగి వీర వెంకటసత్యనారాయణ, చెల్లుబోయిన నరేన్‌, వేముల ఏసుబాబు, కట్టా జమిందర్‌, డాక్టర్‌ చొల్లంగి సత్యగిరి, పి తాని హరికృష్ణ, చాప రాజా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement