ప్రత్తిపాడు రూరల్: కోతుల దాడిలో ఓ వృద్ధురాలు మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం.. పెద్దిపాలెం గ్రామానికి చెందిన దానబోయిన చినబుల్లి (70) స్థానిక సంత మార్కెట్ వద్ద ఉన్న మామిడి తోటలో ఇల్లు నిర్మించుకుని అందులో కుమార్తెతో కలసి జీవిస్తుంది. ఇంటి వద్ద అల్లుడు, కుమార్తె లేని సమయంలో తోటలోని తనకు చెందిన పశువుల వద్దకు వెళ్లింది. ఆమె ఒంటరిగా ఉండటంలో ఒక్కసారిగా కోతులు దాడిచేసి గాయపర్చాయి. ఈ దాడితో చినబుల్లి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ముగ్గురికీ వివాహాలు జరిపించి పెద్ద కుమార్తె లక్ష్మి వద్ద జీవనం సాగిస్తుంది.


