డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

డ్రైనేజీలో పడి వ్యక్తి మృతి

Mar 11 2026 7:50 AM | Updated on Mar 11 2026 7:50 AM

తుని: స్థానిక సీతారాంపురంలోని వైఎస్సార్‌ విగ్రహం సమీపంలో ఉన్న మురుగు కాలువలో పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సీఐ ఎం.గీతా రామకృష్ణ మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కాలువలో వ్యక్తి మృతదేహం ఉందన్న స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ మృతదేహాన్ని బయటకు తీయించి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి సుమారు 45 నుంచి 50 ఏళ్ల వయసు ఉంటుందని, ఒంటిపై మెరూన్‌ కలర్‌ పువ్వుల షర్టు, లైట్‌ కలర్‌ జీన్‌ ప్యాంటు ఉన్నాయని, అతడి దగ్గర లభించిన బ్యాగు లో తమలపాకులు కట్‌ చేసే వేతివేళ్ల పనిముట్లు ఉన్నాయన్నారు. మృతుడి వివరాలు తెలిసినవారు తుని పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

గొండోలు వంతెనను ఢీకొన్న కారు

అడ్డతీగల: గొండోలులోని మడేరు వాగుపై ఉన్న వంతెనను మంగళవారం మితిమీరిన వేగంతో వచ్చిన నంబర్‌ లేని కారు బలంగా ఢీకొట్టింది. రాజవొమ్మంగి నుంచి అడ్డతీగల వైపు వస్తున్న ఈ కారు అదుపు తప్పి, వంతెన గోడను ఢీకొట్టి నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయ్యింది. దానిలోని ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దురదృష్టవశాత్తూ కారు కొద్దిగా ముందుకు వెళితే సుమారు 150 అడుగుల లోతులో కాలువలో పడిపోయి ఉండేది. దీనిపై అడ్డతీగల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement