అధైర్య పడొద్దు, అండగా ఉంటాం
● మాజీ ముఖ్యమంత్రి జగన్ భరోసా
● తాడేపల్లిలో ఆయనను
కలిసిన చోడవరం కార్యకర్తలు
దేవరపల్లి: అక్రమ కేసులకు అధైర్యపడొద్దని, ఎల్లప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటామని చోడవరం కార్యకర్తలకు వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా నల్లజర్ల మండలం చోడవరంలో ఫ్లెక్సీ వివాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలో అక్రమంగా అరెస్టు కాబడి, బెయిల్‌పై విడుదలైన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మాజీ హోం మంత్రి, గోపాలపురం కో ఆర్డినేటర్ తానేటి వనిత ఆధ్వర్యంలో బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్‌ను కలిశారు. వారిని జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు. జరిగిన సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్రమ కేసులకు భయపడవద్దని, దానికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. బాధితులు కొంబత్తుల సాధు, కనికెళ్లి రవి, అక్కల ఏసు, పొట్టి నవీన్, తానింకి శ్రీను, కత్తుల రమేష్, దొడ్డిగర్ల రాజేష్, ఉసురుమర్తి సాయికుమార్, లాయర్లు ముప్పిడి వెంకటరత్నం, బోడిగడ్ల రాంబాబు, పార్టీ మండల అధ్యక్షుడు వెల్లంకి సుబ్రహ్మణ్యం, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బంకా అప్పారావు, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి వామిశెట్టి పరమేశ్వరరావు, మండల మైనార్టీ విభాగం అధ్యక్షుడు సయ్యద్ మునాఫ్, మండల బీసీ విభాగం అధ్యక్షుడు చిన్ని నాగు యాదవ్, మండల వాణిజ్య విభాగం అధ్యక్షుడు శ్రీకాకోళపు ఆదిత్య, మండల మహిళా విభాగం అధ్యక్షురాలు వై.లక్ష్మి, తాడిగడప శ్రీను తదితరులు జగన్‌ను కలిశారు.


