గోదావరిలో పడి వృద్ధుడి మృతి
మామిడికుదురు: పెదపట్నంలంక గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. స్థానిక గెడ్డంవారి పేటకు చెందిన గెడ్డం సంజీవరావు (65) స్థానిక గోదావరి వద్దకు బహిర్భూమికి వెళ్లి మృతి చెందాడు. సంజీవరావు కుమారుడు రాజారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం ఎస్సై ఎ.చైతన్యకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంటి నుంచి వెళ్లిన సంజీవరావు కనిపించక పోవడంతో అతని కోసం గాలించగా గోదావరిలో మృతదేహం లభ్యమైందన్నారు. మృతుడు సంజీవరావుకు భార్య గవరమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంజీవరావు మృతితో కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపించారు.


