
నేడు శనైశ్చరాలయం మూసివేత
ముమ్మిడివరం: మండలంలోని చినకొత్తలంక పంచాయతీ రెండో వార్డు మెంబర్ కముజు వీర వెంకట సత్యనారాయణ (48) శనివారం కొబ్బరి చెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. ఉదయం కొబ్బరి బొండాం కోసం చెట్టు ఎక్కి, కాలు జారి పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని ముమ్మిడివరం ఆసుపత్రికి తరలించగా, పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. మృతుడికి భార్య శ్రీలక్ష్మి, ఒక కుమార్తె, వృద్ధ తల్లిదండ్రులు సత్యనారాయణ, సత్యవతి ఉన్నారు. భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై జ్వాలా సాగర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.