
మహీంద్ర ఎలక్ట్రిక్ కార్ల విడుదల
రాజమహేంద్రవరం రూరల్: రాజమహేంద్రవరంలోని ఎంఅండ్‌ఎన్ మోటార్స్ షోరూంలో శనివారం మహీంద్ర ఎలక్ట్రిక్ వాహనాలైన ఎక్స్‌యూవీ 9ఈ, బీఈ6ల నుంచి ప్యాక్–2 వెర్షన్లను ఆ సంస్థ ప్రతినిధులు మార్కెట్ లోకి విడుదల చేశారు. ఇతి తక్కువ వ్యవధిలోనే (5 నెలల్లో 20 వేల మంది వినియోగదారులు) అత్యున్నత ఆదరణను పొందిన ఈ కార్లను మరింతగా వినియోగదారులకు చేరువ చేసేందుకు కొత్త వెర్షన్లు ఆవిష్కరించినట్టు తెలిపారు. ఎక్స్‌యూవీ 9ఈ ప్యాక్–2 ధర రూ.24,90,000, బీఈ6 ప్యాక్ ధర రూ.21,90,000 (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించారు. ఇవి 59, 79 కేడబ్ల్యూ బ్యాటరీ ప్యాక్‌లతో పాటు 7, 11 కేవీ చార్జర్లలో లభిస్తున్నాయన్నారు. అడాస్ లెవెల్–2++, 1 విజన్ కెమెరా, 1 రాడార్ సిస్టమ్‌తో ఎంఈ4యు యాప్‌తో కనెక్ట్ చేసుకుంటే వాహన స్థితిగతులను వినియోగదారుడు తన మొబైల్ నుంచే గమనించవచ్చన్నారు. కార్యక్రమంలో ఎండీ రాధాకృష్ణ, డైరెక్టర్ శ్రీరాం, జీఎం రాజ తదితరులు పాల్గొన్నారు.