
పూర్వ విద్యార్థుల దాతృత్వం
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరు జీఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ బ్రాంచ్ విద్యార్థుల కోసం రూ.2.5 లక్షల విలువైన హైడ్రాలిక్ ల్యాబ్‌కు సంబంధించిన 5 మెషీన్లను పూర్వ విద్యార్థులు బహూకరించారు. ఆదివారం హైడ్రాలిక్ ల్యాబ్‌ను పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.మురళి ప్రారంభించగా ఆయనకు మెషీన్లు అందజేశారు. ముందుగా పూర్వ విద్యార్థులు ప్రిన్సిపాల్‌తో పాటు కంప్యూటర్, మెకానికల్, ఎలక్ట్రానిక్ బ్రాంచ్ హెడ్‌లను కలసి కళాశాల అభివృద్ధిపై చర్చించారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బోరుగడ్డ జోసఫ్, కోశాధికారి కొంబత్తుల శ్రీనివాస్, సెక్రటరీ మేరుగ రత్నకిశోర్ మాట్లాడుతూ 2015లో రూ.2 లక్షలతో ఆర్వో ప్లాంట్, 2022లో ఎలక్ట్రానిక్స్ లాబ్స్‌కు వాటర్ లీకేజీ రాకుండా రూ. 3 లక్షలతో రూఫ్ టాపింగ్ చేశామని, నాలుగు నెలల క్రితం హాస్టల్ విద్యార్థుల కోసం చపాతీ/పూరీ మేకర్ ఇచ్చామన్నారు. పూర్వ విద్యార్థులు రాజకుమార్, కృపారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.