జిల్లాలో 3.30 లక్షల ఇళ్లకు కుళాయిలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో 3.30 లక్షల ఇళ్లకు కుళాయిలు

Sep 4 2025 5:55 AM | Updated on Sep 4 2025 5:55 AM

జిల్లాలో 3.30 లక్షల ఇళ్లకు కుళాయిలు

జిల్లాలో 3.30 లక్షల ఇళ్లకు కుళాయిలు

జిల్లాలో 3.30 లక్షల ఇళ్లకు కుళాయిలు

ఆర్థిక అక్షరాస్యతపై

అవగాహన కల్పించాలి

కలెక్టర్‌ ప్రశాంతి

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జల్‌ జీవన్‌ మిషన్‌ కింద ఇప్పటి వరకూ జిల్లాలో 3,56,543 ఇళ్లకు గాను 3,30,000 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్టు కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. జల్‌ జీవన్‌ మిషన్‌ అదనపు జాయింట్‌ సెక్రటరీ సి.కమల్‌ కిశోర్‌ బుధవారం న్యూఢిల్లీ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 92 శాతం గృహల వివరాలను ఐఎంఐఎస్‌ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశామన్నారు. జిల్లాలోని 865 పాఠశాలలు, 868 అంగన్‌వాడీ కేంద్రాలకు సురక్షిత తాగునీటి కోసం కుళాయిలు అందజేసినట్లు తెలిపారు. ఇప్పటికే రూ.144.38 కోట్లతో 491 పనులు పూర్తి చేసి గ్రామ పంచాయతీలకు అప్పగించామని, మరో రూ.24.75 కోట్లతో చేపట్టిన 48 పనులు పూర్తి కావడంతో త్వరలో వాటిని కూడా పంచాయతీలకు అప్పగిస్తామన్నారు.

బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ తప్పనిసరి

బ్యాంకు ఖాతాలకు ఈ–కేవైసీ తప్పనిసరిగా చేయించాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. స్థానిక వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో మనం అక్షరాస్యత గురించి మాట్లాడే వారమని, కానీ నేడు ఆర్థిక అక్షరాస్యత, భౌతిక అక్షరాస్యత గురించి కూడా చర్చించాలన్నారు. బ్యాంకు ఖాతాను తెరవడం, దానిని కాలానుగుణంగా అప్‌డేట్‌ చేయడం, సురక్షితంగా ఖాతాను నిర్వహించడం.. ఇవన్నీ ఆర్థిక అక్షరాస్యతలో భాగమని తెలిపారు. 2014లో జన్‌ ధన్‌ యోజన కింద జీరో బ్యాలెన్స్‌ ఖాతాలను చాలామంది తెరిచారని, అలాంటి వారంతా ఇప్పుడు తమ ఖాతాలకు ఈ–కేవైసీ తప్పక చేయించాలని సూచించారు. సైబర్‌ నేరాలు పెరిగిన నేపథ్యంలో డిజిటల్‌ చెల్లింపులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ లలిత్‌ త్యాగి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆర్థిక సేవలు అందేలా చూసి, ఆర్థిక సమ్మిళితకై సంతృప్తి స్థాయిలో ప్రచారం చేపట్టాలన్నారు. భారత ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం ఆదేశాల మేరకు జూలై ఒకటి నుంచి సెప్టెంబర్‌ 30 వరకు మూడు నెలల పాటు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వివిధ స్వయం సహాయక బృందాలకు రూ.20 లక్షల చొప్పున నమూనా చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement