
87 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
గురుపూజోత్సవంలో సాంస్కృతిక ప్రదర్శనలిస్తున్న విద్యార్థులు
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో జిల్లా పాఠశాల విద్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. మొత్తం 87 మంది ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్స్, స్పెషల్ గ్రేడ్ టీచర్స్, ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డులను అందుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ మాట్లాడుతూ సమాజం ఉన్నతంగా ఎదిగేలా ఉపాధ్యాయులు తమ బాధ్యతను నిర్వర్తించాలన్నారు.
కలెక్టర్ పి.ప్రశాంతి మాట్లాడుతూ మన జీవితాన్ని ప్రభావితం చేసే వ్యక్తి ఉపాధ్యాయుడేనన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర వహిస్తున్నారన్నారు.
సభకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జాయింట్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్, ఆర్టీవో ఆర్.కృష్ణనాయక్, కొవ్వూరు ఆర్డీవో రాణి సుస్మిత, అడిషినల్ ఎస్పీ సుబ్బరాజు, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్.సుభాషిణి, జిల్లా విద్యా శాఖాధికారి కంది వాసుదేవరావు, శాప్ డైరెక్టర్ రవీంద్రనాథ్, అర్బన్ రేంజ్ డీఐ బి.దిలీప్ కుమార్, రూరల్ ఎంఈవో తులసిదాస్ పాల్గొన్నారు.

87 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు