
మినీ మహానాడులో.. టీఢీపీ
సాక్షి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్: మినీ మహానాడు వేదికగా టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు బహిర్గతమయ్యాయి. కార్యక్రమ నిర్వహణ పద్ధతిగా లేదంటూ ఒకరు.. తమ నేతకు ప్రాధాన్యం దక్కలేదని మరో వర్గం.. అసలు పార్టీ కార్యాలయమే లేకపోవడమేమిటని మరొక నేత వ్యాఖ్యానించడంతో సభలో కలకలం రేగింది. స్వపక్షంలోనే నేతలు విపక్షంగా మారి ప్రశ్నల వర్షం కురిపించడం చర్చనీయాంశంగా మారింది. సీనియర్ నేతలే ఆవేదన వెళ్లగక్కడం చూస్తూంటే టీడీపీలో అంతర్గత కుమ్ములాటలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. రాజమహేంద్రవరం జేఎన్ రోడ్డులోని ఓ ఫంక్షన్ హాలులో టీడీపీ జిల్లా స్థాయి మినీ మహానాడు శుక్రవారం నిర్వహించారు. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వాసు వర్గం కొంత మందికే ప్రాధాన్యం ఇచ్చిందని, మిగిలిన వారిని పక్కన పెట్టిందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు పరస్పరం విమర్శలకు దిగడం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది.
నిర్వహించే పద్ధతి ఇదేనా?
క్రమశిక్షణకు మారుపేరైన ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో క్రమశిక్షణ కొరవడిందని రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ (రుడా) మాజీ చైర్మన్, సీనియర్ నేత గన్ని కృష్ణ ధ్వజమెత్తారు. ఒక పద్ధతి లేకుండా కార్యక్రమం నిర్వహిస్తున్నారని, ప్రొటోకాల్ పాటించడం లేదని అన్నారు. ముందుండి నడిపించాల్సిన జిల్లా అధ్యక్షుడు ఈ కార్యక్రమానికే రాలేదని విమర్శించారు. ఎన్టీఆర్ మీద అభిమానంతో పార్టీలోకి వచ్చామని.. తన వ్యాఖ్యలు కొందరికి కోపం రప్పించినా ఫర్వాలేదన్నారు. పార్టీ క్రమశిక్షణతో నడవాలనే ఉద్దేశాన్ని కుండ బద్దలుగొట్టినట్లు వెల్లడించారు. గన్ని ప్రసంగం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారి తీసింది.
పార్టీ కార్యాలయానికే దిక్కులేదు
రాజకీయాలకు కీలకమైన తూర్పు గోదావరిలో టీడీపీకి ఇప్పటి వరకూ జిల్లా స్థాయి కార్యాలయం ఏర్పాటు చేయకపోవడంపై రుడా చైర్మన్ బొడ్డు వెంకట రమణ చౌదరి అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయమే లేదు.. ఇక పార్టీ అంతర్గత నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.
గోరంట్లకు ఘోర అవమానం
పార్టీ ఆవిర్భావం నుంచీ కీలక నేతగా ఉన్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఘోర అవమానం ఎదురైంది. సభా ప్రాంగణం స్వాగత ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఆయన ఫొటోకు చోటు దక్కలేదు. దీంతో కోపోద్రిక్తులైన గోరంట్ల అనుచరులు, పార్టీ నేతలు ఒక్కసారిగా సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆదిరెడ్డి అప్పారావు, వాసు వ్యవహార శైలికి నిరసనగా డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్, వాసిరెడ్డి రాంబాబు, మజ్జి పద్మావతి నిరసనకు దిగారు. సీనియర్ నేత అనే గౌరవం కూడా లేకుండా ఫొటో పెట్టకుండా అవమానించడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. దీంతో, ఈ పంచాయితీ జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి వెళ్లింది. ఆయన రంగంలోకి దిగి, ఎమ్మెల్యేకి సూచించడంతో చివరకు సభా వేదిక వద్ద ఉన్న బ్యానర్‌లో హుటాహుటిగా బుచ్చయ్య ఫొటో ఏర్పాటు చేశారు.
ఆది నుంచీ ఇదే తంతు
ఫ ఆదిరెడ్డి అప్పారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య కొన్నేళ్లుగా వర్గ పోరు నడుస్తూనే ఉంది. తాజాగా పేపర్ మిల్లు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు పేపర్ మిల్లు కార్మిక సంఘం నాయకుడు ప్రవీణ్ చౌదరిపై ఫోన్‌లో రెచ్చిపోయారు. నీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. వారిద్దరి ఫోన్ కాల్ సంభాషణ వాట్సాప్ గ్రూపుల్లో హల్‌చల్ చేసింది. ‘నువ్వు వైఎస్సార్ పార్టీలోకి బుచ్చయ్య మాట విని వెళ్లావు. ఏం పీకావు? మా మీద కామెంట్లు చేశావు. విడిచిపెడతాననుకోకు. కామెంట్లకు పనిష్మెంట్లు ఉంటాయి’ అంటూ ప్రవీణ్‌పై అప్పారావు ధ్వజమెత్తారు.
ఫ రాజమహేంద్రవరానికి కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో ఇప్పటికే గోరంట్ల, ఆదిరెడ్డి వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రూరల్‌కు చెందిన విలీన గ్రామాలతో కలిపి ఎన్నికలు నిర్వహించాలని గోరంట్ల పట్టుబడుతుండగా.. విలీనం లేకుండానే ఎన్నికలకు వెళ్లాలని ఆదిరెడ్డి వర్గం వాదిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పటికే సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఎన్నికలు ఎప్పుడున్న స్పష్టత రావడం లేదు.
ఫ ఆదిరెడ్డి అప్పారావు, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు – రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మధ్య ఇటీవల రాజమహేంద్రవరం బోధనాస్పత్రి వద్ద మెడికల్ షాపు వివాదం మళ్లీ అగ్గి రాజేసింది. తమకు కావాలంటే తమకే దక్కాలంటూ పట్టుబట్టడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇలా ప్రతి విషయంలోనూ వర్గ విభేదాలు రాజుకుంటూనే ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆధ్వర్యంలో మినీ మహానాడు జరగడం.. బుచ్చయ్యతో విభేదాల నేపథ్యంలోనే ఆయన ఫొటోకు స్వాగత ఫ్లెక్సీలో స్థానం కల్పించలేదన్న భావన పార్టీ శ్రేణుల్లో ఉంది. ఎంత విభేదాలున్నా పార్టీ కార్యక్రమానికి అందరూ కలసి రావాలి తప్ప.. ఇలా రచ్చకెక్కడమేమిటని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
·˘ M>Æý‡Å{MýSÐ]l$ °Æý‡Óç߿׿Oò³ AçÜ…™èl–í³¢
·˘ ç³§ýl®†V> fÆý‡VýSÌôæ§ýl…r*
గన్ని కృష్ణ ధ్వజం
·˘ hÌêÏ A«§ýlÅ„ýS$yól OVðSÆ>áfOÆð‡™ól
ఎలాగంటూ మండిపాటు
·˘ ´ëÈtMìS hÌêÏ M>Æ>ÅÌSĶæ$…
లేకపోవడమేమిటన్న బొడ్డు
·˘ ïܰĶæ$ÆŠ‡ GÐðl$ÃÌôæÅ VøÆý‡…rÏ
ఫొటోకు దక్కని చోటు
·˘ ¯ól™èlÌS A…™èlÆý‡Y™èl
కుమ్ములాటలు బహిర్గతం
అగ్నికి ఆజ్యం పోసిన పరిశీలకుడు
మినీ మహానాడు వేదికగా పార్టీ బలోపేతం, అంతర్గత నిర్మాణం, నేతల ప్రాధాన్యంపై టీడీపీ శ్రేణులు ప్రశ్నించగా.. పుండు మీద కారం జల్లినట్లు.. పార్టీ పరిశీలకుడు, రాష్ట్ర అటవీ కార్పోరేషన్ చైర్మన్ సుజయకృష్ణ రంగారావు చేసిన వ్యాఖ్యలు ఆయా వర్గాల్లో మరింత ఆగ్రహావేశాలు నింపాయి. అనుకున్న పదవులు రానందువల్లనే నేతలందరూ ఇలా ఆవేదన చెందుతున్నారని అంటూ ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటలు పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ పరిశీలకుడిగా పరిస్థితిని చక్కదిద్దాల్సింది పోయి.. అగ్నికి ఆయన మరింత ఆజ్యం పోస్తున్నారన్న భావన కార్యకర్తల్లో వెల్లడైంది. ఆయన చేసిన వ్యాఖ్యలతో అందరూ అవాక్కయ్యారు.

మినీ మహానాడులో.. టీఢీపీ

మినీ మహానాడులో.. టీఢీపీ