
కూటమి హామీలు నెరవేర్చాలి
రాజమహేంద్రవరం రూరల్: ఎన్నికల సమయంలో తమకిచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏపీసీపీఎస్‌ఈఏ) అధ్యక్ష సహాయ అధ్యక్షులు పఠాన్ బాజీ, చీర్ల కిరణ్ డిమాండ్ చేశారు. ఈ నెల 1న చిత్తూరులో ప్రారంభమైన సీపీఎస్ ఉద్యోగుల చైతన్య యాత్ర శుక్రవారం రాజమహేంద్రవరం చేరుకుంది. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించిన సీపీఎస్ ఉద్యోగుల ధర్నాలో నేతలిద్దరూ ప్రసంగించార. రాష్ట్రంలో 3 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులను ద్వితీయ శ్రేణి ఉద్యోగులుగా మార్చే విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎన్నికల ముంది ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. అధికారులు, ప్రభుత్వం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకున్న వారే లేరన్నారు. సీపీఎస్ ఉద్యోగులు ఆర్థికంగా, సామాజికంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం చెప్పే మాటలకు, చేస్తున్న పనులకు పొంతన లేకుండా ఉందన్నారు. ఎన్నికల సమయంలో సీపీఎస్ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తప్పనిసరిగా నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్‌ఓ టి.సీతారామ్మూర్తికి సీపీఎస్ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి సీహెచ్ విల్సన్‌పాల్, సహాధ్యక్షుడు డీఎస్ చాంబర్లీన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జీఎస్ రమేష్, ఉపాధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీలు జె.రాజారావు, కె.గోపాలకృష్ణ, కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.
·˘ ïÜï³-G‹Ü E§øÅVýS çÜ…çœ$ ¯ól™èlË$
·˘ MýSÌñæMýSt-Æó‡sŒæ Ð]l§ýlª «§ýlÆ>²