నల్లజర్ల: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువ రావడంతో దూబచర్ల సంఘమిత్రా స్కూల్ విద్యార్థులు షేక్ అబ్ధుల్ సలామ్, పి.రమ్యశ్రీలు రీ వాల్యుయేషన్‌కు దరఖాస్తు చేశారు. షేక్ అబ్ధుల్‌కు సోషల్ సబ్జెక్ట్‌లో 13 మార్కులు కలిశాయి. దీంతో 586 మార్కులతో స్కూల్ టాపర్‌గా, మండలంలో 4వ స్థానం సాధించాడు. పి.రమ్యశ్రీకి హిందీలో 10 మార్కులు కలిశాయి. దీంతో ఆమెకు 513 మార్కులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆ స్కూల్ డైరెక్టర్ అంబటి శ్రీనివాసరావు శనివారం విలేకర్లకు తెలిపారు.
పని మనిషే నిందితురాలు
సామర్లకోట: ఇంట్లో పని మనిషి చోరీ చేసిన సంఘటన స్థానికంగా కలకలం రేపింది. సీఐ ఎ.కృష్ణభవాన్ కథనం ప్రకారం.. స్థానిక అంబటివారి తోటలోని సింగవరపు సత్యనారాయణ ఇంట్లో బొడ్డు దుర్గాదేవి పని చేస్తోంది. ఆ ఇంట్లో ఎవరూ లేని సమయంలో విలువైన వజ్రాలు, వాచ్, బంగారు ఆభరణాలు చోరీ చేసింది. చోరీ విషయాన్ని గమనించిన సత్యనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నీలమ్మ చెరువు వద్ద ఉన్న పని మనిషి దుర్గాదేవిపై అనుమానంతో ఇంటికి వెళ్లి సీఐ కృష్ణభవాన్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. ఆమె ఇంట్లో బంగారు ఆభరణాలు, 17 చిన్న డైమండ్స్, ఒక స్మార్ట్ వాచ్‌ను గుర్తించారు. వీటి విలువ సుమారు రూ. ఆరు లక్షలు ఉంటుందని సీఐ తెలిపారు. ఈ మేరకు వీఆర్వో ఎస్.ఏడుకొండలు సమక్షంలో ఆమె నుంచి వాంగ్మూలం సేకరించగా నేరాన్ని అంగికరిందన్నారు. నిందితురాలిని అరెస్టు చేసి కోర్టుకు తరలించగా రిమాండ్ విధించారని చెప్పారు. చోరీ సొత్తును రికవరీ చేసిన సీఐ కృష్ణభగవాన్, క్రైమ్ సీఐ అంకబాబు, సిబ్బందిని డీఎస్పీ డి.శ్రీహరిరాజు అభినందించారు.
రీ వాల్యుయేషన్‌లో పెరిగిన మార్కులు
రీ వాల్యుయేషన్‌లో పెరిగిన మార్కులు