సేవ చేయనీయవా స్వామీ.. | - | Sakshi
Sakshi News home page

సేవ చేయనీయవా స్వామీ..

May 24 2025 12:37 AM | Updated on May 24 2025 12:37 AM

సేవ చ

సేవ చేయనీయవా స్వామీ..

అన్నవరం: భక్తవరదుడైన సత్యదేవుని సన్నిధిలో స్వచ్ఛందంగా సేవలు చేద్దామని.. కాస్తంత పుణ్యం మూటగట్టుకుందామని ఎక్కడెక్కడి నుంచో వస్తున్న భక్తులు.. అన్నవరం దేవస్థానంలో చుక్కలు చూస్తున్నారు. సేవ చేద్దామనే ఆశ.. చేయడానికి శక్తి ఉన్నా.. ఎవరిని సంప్రదించాలో.. ఏం చేయాలో తెలియక ఇక్కట్లు పడుతున్నారు. సేవ చేయడానికి వచ్చిన తమను ఏఈఓ కె.కొండలరావు దూషించారంటూ మంచిర్యాల భక్తులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

రత్నగిరిపై వివిధ ప్రాంతాల్లో కాషాయ రంగు చీరలు ధరించిన మహిళా సేవకులు.. భక్తులకు కనిపిస్తూంటారు. వీరందరూ తెలంగాణలోని వరంగల్‌, కరీంనగర్‌, మంచిర్యాల, మన రాష్ట్రంలోని గుంటూరు, నెల్లూరు తదితర దూర ప్రాంతాల నుంచి వస్తున్న స్వచ్ఛంద సేవకులు. వీరందరూ దేవస్థానంలో తమకు నిర్దేశించిన సేవలు ఉచితంగా అందిస్తూంటారు. ఇదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి కూడా స్వామి సన్నిధిలో సేవ చేద్దామనే ఆశతో వస్తున్నా.. రత్నగిరిపై ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి నెలకొందని భక్తులు ఆవేదన చెందుతున్నారు.

సేవా విభాగం లేక..

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి రోజూ వేలాదిగా మహిళా సేవకులు వివిధ చోట్ల సేవలందిస్తూంటారు. అలాగే, పరకామణి అంటే హుండీ లెక్కింపుతో పాటు ఇతర సేవలను పురుషులు అందిస్తూంటారు. భక్తులు స్వచ్ఛందంగా సేవ చేయడానికి అనుమతి ఇచ్చేందుకు టీటీడీలో ప్రత్యేకంగా ఒక విభాగం ఉంది. దాని ఫోన్‌ నంబర్‌ టీటీడీ వెబ్‌సైట్‌లో ఉంటుంది. సేవకు వెళ్లాలనుకునేవారు ఆ నంబర్‌కు ఫోన్‌ చేస్తే వారు పూర్తి వివరాలు చెబుతారు. దాని ప్రకారం ఆ సేవా కార్యకర్తలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఎప్పుడు సేవకు రావాలి, ఎవరిని కలవాలనే వివరాలు తెలియజేస్తారు. దాని ప్రకారం భక్తులు అక్కడకు వెళ్లి సేవ చేయవచ్చు. ఇటువంటి ఏర్పాటు అన్నవరం దేవస్థానంలో లేదు. గతంలో సేవ చేసిన వారైతే దేవస్థానంలో పరిచయం ఉన్నవారికి ఫోన్‌ చేసి వస్తున్నారు. కొత్తవారైతే మధ్యవర్తులను ఆశ్రయించి, మోసపోవాల్సిన పరిస్థితి.

మంచిర్యాలకు చెందిన 18 మంది మహిళా సేవా కార్యకర్తలు ఇదేవిధంగా మోసపోయారు. అన్నవరం దేవస్థానంలో సేవ చేసేందుకు మధ్యవర్తిని ఆశ్రయించగా, అతడు మరో మహిళకు ఈ పని అప్పగించాడు. ఆమె అన్నవరం దేవస్థానానికి పంపిస్తానని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.500 చొప్పున వసూలు చేసింది. తీరా ఇక్కడకు వస్తే సేవ చేయడానికి ఖాళీ లేదని, వెళ్లిపోవాలని ఏఈఓ చిరాకుపడ్డారని వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ భక్తుల నుంచి రూ.500 చొప్పున వసూలు చేసిన మహిళ.. ఆ తరువాత రూ.300 చొప్పున వెనక్కి ఇచ్చి, మిగిలిన రూ.200 ఉంచుకున్నట్లు అధికారుల విచారణలో తేలింది. ఇటువంటి అవస్థలు భక్తులకు ఎదురవకుండా ఉండాలంటే అన్నవరం దేవస్థానంలో కూడా టీటీడీ తరహాలో ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేయాలని పలువురు సూచిస్తున్నారు. అనంతరం, సేవ చేయాలనుకునేవారు ఆ విభాగాన్ని సంప్రదించేలా ఫోన్‌ నంబర్‌ను దేవస్థానం వెబ్‌సైట్‌లో పొందుపరచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

·˘ Æý‡™èl²WÇOò³ çÜÓ^èle…§ýl õÜÐ]lMýS$ÌSMýS$ Cº¾…§ýl$Ë$

ఫ సేవకు దేవస్థానంలో ఎవరి అనుమతి తీసుకోవాలో తెలియని పరిస్థితి

·˘ {ç³™ólÅMýS Ñ¿êVýS… HÆ>µr$

చేయాలని భక్తుల డిమాండ్‌

మాకూ ఇలాగే జరిగింది

సత్యదేవుని దీక్ష, ఉత్సవాల గురించి ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రచారం చేస్తూంటాను. మా ప్రాంతం నుంచి సేవా కార్యకర్తలను అన్నవరం దేవస్థానానికి తీసుకువెళ్తే ఇప్పుడు ఖాళీ లేదని చెప్పారు. దాంతో వెనక్కి వచ్చేశాం. దీనికోసం దేవస్థానంలో ఒక విభాగం ఏర్పాటు చేసి, స్వచ్ఛంద సేవ చేసే భక్తులకు సమయం నిర్దేశిస్తే మేలు.

– కృష్ణ, సేవా కార్యకర్త

సేవ చేయనీయవా స్వామీ..1
1/2

సేవ చేయనీయవా స్వామీ..

సేవ చేయనీయవా స్వామీ..2
2/2

సేవ చేయనీయవా స్వామీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement