
మద్యం షాపులు, బార్లు నిబంధనలు పాటించాలి
ఫ దీనిపై నైట్ పెట్రోలింగ్
ఫ జిల్లా ఎకై ్సజ్ అధికారి లావణ్య
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు నిబంధనలకు అనుగుణంగా పని చేసేలా చూసేందుకు నైట్ పెట్రోలింగ్ నిర్వహిస్తామని జిల్లా ప్రొహిబిషన్, ఎకై ్సజ్ అధికారి చింతాడ లావణ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమయ పాలన పాటించేలా, లూజు విక్రయాలు, ఎమ్మార్పీకి మించి అమ్మకాలు జరగకుండా చూడటం, అనధికార సిట్టింగ్‌లను నివారించడం, షాపు పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు చేపడతామని వివరించారు. షాపులో రికార్డులు సమర్థవంతంగా నిర్వహించేలా, సీసీ కెమెరాలు సక్రమంగా పని చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనిలో భాగంగా ప్రతి కానిస్టేబుల్‌కు మూడు నాలుగు షాపుల బాధ్యత అప్పగించామన్నారు. నైట్ పెట్రోలింగ్‌ను ఎస్సై, ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నేరుగా పర్యవేక్షిస్తారని లావణ్య తెలిపారు. మద్యం షాపులు, బార్లు పకడ్బందీగా నిర్వహించేలా ఎకై ్సజ్ ‘ఐ’ మొబైల్ అప్లికేషన్ త్వరలో వస్తుందన్నారు. ఎకై ్సజ్ నేరాలకు సంబంధించి ఫిర్యాదులుంటే 14405 టోల్ ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఉపాధ్యాయులకు
తప్పని బదిలీలు
రాయవరం: బదిలీ దరఖాస్తుల ప్రక్రియలో ఉపాధ్యాయులు తలమునకలయ్యారు. ఈ నెల 21 నుంచి ఉపాధ్యాయుల బదిలీలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన విషయం పాఠకులకు విదితమే. ఇప్పటికే ప్రధానోపాధ్యాయుల బదిలీ దరఖాస్తుల గడువు ముగియగా, స్కూల్ అసిస్టెంట్ల ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించే గడువు శనివారం అర్ధరాత్రితో ముగుస్తుంది. ఈ నెల 27వ తేదీ వరకు సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీ దరఖాస్తులకు గడువు ఉంది. అయితే బదిలీ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో సబ్మిషన్ చేసే సమయంలో సాంకేతిక పరమైన సమస్యలు తలెత్తుతున్నట్లు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఆన్‌లైన్ బదిలీ దరఖాస్తుల సబ్మిషన్ సమయంలో ఓటీపీ రావడంలో సమస్యలు తలెత్తుతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. శుక్రవారం ఉదయం సర్వర్ మొరాయించగా, మధ్యాహ్నం నుంచి సర్వర్ పనిచేయడంతో దరఖాస్తులు చేసుకున్నారు. పీడీలు దరఖాస్తు చేసుకునేందుకు సర్వర్‌లో ఓపెన్ కాగా, పీఈటీలకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకునేందుకు ఓపెన్ కాలేదని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. పూర్వపు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న 64 మండలాల పరిధిలో 3,696 మంది ఉపాధ్యాయులకు తప్పనిసరి స్థానచలనం ఉంది. ఈ జాబితాలో గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, తత్సమాన క్యాడర్ ఉపాధ్యాయులున్నారు. వీరిలో రెండేళ్ల లోపు ఉద్యోగ విరమణ అయ్యే ఉపాధ్యాయులు, దివ్యాంగ ఉపాధ్యాయులకు వారు కోరుకుంటే తప్ప బదిలీ చేపట్టరు.
ఖాళీలపై రావాల్సిన స్పష్టత
క్యాడర్ల వారీగా ఉపాధ్యాయుల ఖాళీలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు బదిలీ దరఖాస్తులు సమర్పించగా, స్కూల్ అసిస్టెంట్లకు ఈ నెల 24 అర్ధరాత్రితో గడువు ముగియనుంది. దరఖాస్తులను సమర్పించిన తర్వాత బదిలీ కోరుకునే ప్రాంతాన్ని ఎంపిక చేసుకునే ఆప్షన్ ఇస్తారు. ఆ సమయానికి పూర్తి స్థాయిలో ఖాళీలను ప్రదర్శించాల్సి ఉంటుంది. ఖాళీలపై స్పష్టత వచ్చిన తర్వాత ఉపాధ్యాయులు ప్రాధాన్యతా క్రమంలో వారు బదిలీ కోరుకునే స్థానాలను ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకుంటారు. ఇప్పటికే గ్రేడ్–2 హెచ్‌ఎంల బదిలీ దరఖాస్తుల గడువు ముగియగా, ప్రొవిజినల్ సీనియారిటీ జాబితాలను ఈ నెల 24న విడుదల చేయాల్సి ఉంది. దీనిపై అభ్యంతరాలను 25న స్వీకరిస్తారు. 27న ఫైనల్ సీనియారిటీ జాబితాను ప్రదర్శించి, ఖాళీలను తెలియజేస్తారు. 28న గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులు బదిలీ కోరుకునే ప్రాంతానికి ఆప్షన్స్ ఎంపిక చేసుకుంటారు. ఈ నెల 30 గ్రేడ్–2 ప్రధానోపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు విడుదల కానున్నాయి.