ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయండి

Oct 15 2026 8:12 AM | Updated on Oct 15 2026 8:12 AM

అమలాపురం రూరల్‌: పురపాలక, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ ఆదేశించారు. బుధవారం అమలాపురం కలెక్టరేట్‌లో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వైఖోం నైడియాదేవి, ఎస్పీ రాహుల్‌ మీనాతో కలసి సంబంధిత అధికారులతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ అమలాపురం, రామచంద్రపురం, ముమ్మిడివరం పురపాలక ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను సంబంధిత మున్సిపల్‌ కమిషనర్లు చేపట్టాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో సమస్యల పరిష్కారానికి అమలాపురం కలెక్టరేట్‌తో పాటు అన్ని నియోజకవర్గాలు, మండలాల పరిధిలో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ అధికారి వి.సుబ్బారావు, ఆర్డీఓలు కె.సరళాదేవి, జీవీవీ సత్యనారాయణ, మున్సిపల్‌ కమిషనర్లు ఎం.నిర్మల్‌ కుమార్‌, రామరాజు, ఆర్‌ఆర్‌ రాజు పాల్గొన్నారు.

హుండీల ఆదాయం రూ.26,53,228

రామచంద్రపురం రూరల్‌: ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయంలో హుండీల ఆదాయం రూ.26,53,228 వచ్చినట్లు ఆలయ ఈఓ, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్‌ అల్లు వెంకట దుర్గాభవాని తెలిపారు. రామచంద్రపురం దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.బాలాజీ రాంప్రసాద్‌ సమక్షంలో జూలై 15 నుంచి అక్టోబర్‌ 14 వరకు ప్రధాన ఆలయంలోని హుండీల ద్వారా రూ.25,52,268, అన్నదాన భవనంలో హుండీల ద్వారా రూ. 1,00,960 ఆదాయం వచ్చిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement