సఖినేటిపల్లి: సఖినేటిపల్లిలంక వద్ద వశిష్ట గోదావరి నదిలో చేపలు మృత్యువాత పడి బుధవారం ఒడ్డుకు చేరాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకూ చేపలు నీటిలో తేలుతూ ఒడ్డుకు అధికంగా వస్తూండటంతో కలకలం రేగింది. వాటి నుంచి తీవ్ర దుర్గంధంతో వెలువడుతూండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చేపల మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. నదీ జలాలు కలుషితం కావడం వల్లనే చేపలు చనిపోతున్నాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. నదిలో నీటి నమూనాలు సేకరించి, పరీక్షలు నిర్వహించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


