ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి
రావులపాలెం: స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ సీపీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల కార్యాచరణ, పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల సమన్వయం తదితర కీలక అంశాలపై చర్చించేందుకు గురువారం ఉదయం అమలాపురంలో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి బుధవారం తెలిపారు. దీనికి పీఏసీ సభ్యులు, పార్లమెంట్ కోఆర్డినేటర్, పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ కోఆర్డినేటర్లు, సీఈసీ సభ్యులు, పార్లమెంట్ పరిధిలోని రాష్ట్ర కార్యదర్శులు, ఎస్ఈసీ సభ్యులు పాల్గొంటారన్నారు. ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరించాల్సిన విధి విధానాలు, నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితులు, నాయకులు, కార్యకర్తల బాధ్యతలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తామన్నారు.


