మంగళవారం శ్రీ 11 శ్రీ నవంబర్ శ్రీ 2025
● ముక్కంటి.. శరణంటి
రామచంద్రపురం రూరల్: కార్తిక మాసం.. ఆపై సోమవారం కావడంతో జిల్లాలోని శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిశాయి. దక్షిణ కాశీ ద్రాక్షారామ క్షేత్రంలో మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామివారి ఆలయానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి వచ్చిన భక్తులు ఆలయ ప్రాంగణంలోని సప్త గోదావరిలో స్నానమాచరించి భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. మాణిక్యాంబా అమ్మవారి సన్నిధిలో మహిళలు కుంకుమ పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలాల్లో కార్తిక నోములకు సంబంధించిన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద ఆవు నెయ్యితో పుణ్య సీ్త్రలు దీపారాధన చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గాభవాని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
క్యూలో వేచిఉన్న భక్తులు (అంతరచిత్రం)
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శివలింగం వద్ద దీపాలు వెలిగించి నమస్కరిస్తున్న భక్తులు
మంగళవారం శ్రీ 11 శ్రీ నవంబర్ శ్రీ 2025
మంగళవారం శ్రీ 11 శ్రీ నవంబర్ శ్రీ 2025


