తీరంలో సంచోరీస్తూ.. | - | Sakshi
Sakshi News home page

తీరంలో సంచోరీస్తూ..

Nov 11 2025 5:47 AM | Updated on Nov 11 2025 5:47 AM

తీరంల

తీరంలో సంచోరీస్తూ..

రెచ్చిపోతున్న పశువుల మాఫియా

ఆందోళన చెందుతున్న పాడి రైతులు

కాట్రేనికోన: చోరీల్లో కొత్త పంథాలు అనుసరిస్తున్నారు.. ఏదోలా డబ్బులు సంపాదించాలని కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు.. ఇప్పుడు తీరంలో సంచరిస్తున్న మూగ జీవాలపై పడ్డారు.. వాటిని కబేళాలకు తరలిస్తూ జేబులు నింపుకొంటున్నారు. పాడి రైతులకు ఆవేదన తెచ్చిపెడుతున్నారు. కాట్రేనికోన మండలం కొత్తపాలెం లైట్‌హౌస్‌ ప్రాంతం, మడ అడవులు, సముద్ర తీరం వెంబడి సరుగుడు తోటల్లో సంచరిస్తున్న ఆవులు, గేదెలను పశువుల మాఫియా తరలించుకుపోతోంది. స్థానికంగా కొంత మందితో కుమ్మకై ్కన పశువుల మాఫియా గుట్టుచప్పుడు కాకుండా మినీ వ్యాన్లలో పశువులను తరలించుకుపోతోందనే ఆరోపణలు ఉన్నాయి. కాట్రేనికోన మండలంలో పాడి రైతులు పాలు ఇవ్వని, గర్భం దాల్చని ఆవులు, గేదెలు, దూడలను మడ అడవులు, సముద్ర తీరం వెంబడి ఉన్న సరుగుడు తోటల్లో వదిలేస్తారు. ఇలా మండలంలోని చెయ్యేరు, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, వానపల్లిపాలెం, గచ్చకాయపోర, చిర్రయానం, బలుసుతిప్ప, కందికుప్ప, పల్లంకుర్రు, దొంతికుర్రు తదితర ప్రాంతాలకు చెందిన పాడి రైతులు పాలు ఇవ్వని పాడి పశువులను పోషించలేక మడ అడవులు, సరుగుడు తోటల్లో వదులుతున్నారు. ఆవులు, గేదెలు గర్భం దాల్చి ఈనే సమయాన్ని గుర్తించి తిరిగి ఇంటికి తెచ్చుకుంటారు. మగసానితిప్ప, కందికుప్ప లైట్‌హౌస్‌ ప్రాంతంలోని మడ అడవులు, సరుగుడు తోటలు, చిర్రయానం నుంచి కొత్తపాలెం మొగ ప్రాంతం వరకూ సముద్ర తీరం వెంబడి వందలాది పశువులు సంచరిస్తూ ఉంటాయి. ఈ ప్రాంతాల్లో తిరిగే ఆవులు, గేదెలు స్థానికేతర పాడి రైతులకు చెందినవి కావడంతో కొంతమంది స్థానికుల సహకారంతో అక్రమార్కులు పశువులను కబేళాలకు తరలించుకుపోతున్నారు. అదును చూసి ఆవులు, గేదెలను మినీ వ్యాన్లలో తీసుకెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా కాట్రేనికోన పోలీస్‌ స్టేషన్‌కు పాడి గేదెలు కనబడడం లేదని అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. గత ఏడాది కందికుప్పకు చెందిన పాడి రైతు తన గేదెను లైట్‌హౌస్‌ ప్రాంతంలో సరుగుడు తోటల్లో వదిలేశాడు. గేదెను వారం రోజులకు ఒకసారి వెళ్లి చూసుకునే వాడు. తర్వాత గేదె ఆచూకీ కనిపించకపోవడంతో తీర ప్రాంతం వెంబడి మడ అడవులు, సరుగుడు తోటలు, పరిసర ప్రాంతాల్లో చూశాడు. మినీ వ్యాన్‌లో పశువులను తరలించుకుపోయారని కొందరు చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని అన్నాడు. గత ఏడాది టాటా ఏస్‌ వాహనంలో ఆవులను కబేళాలకు తరలిస్తున్నట్లు గుర్తించిన స్థానికులు అడ్డగించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఆవులను కందికుప్ప సమీపంలో వదిలేసిన పోలీసులు వాహనాన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. సంబంధిత పోలీసు అధికారులు స్పందించి పశువుల మాఫియాను అరికట్టాలని పాడి రైతులు కోరుతున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం..

సముద్ర తీరం వెంబడి సంచరిస్తున్న పాడి పశువులను అక్రమంగా కబేళాలకు తరలించుకుపోతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. సముద్ర తీరం, కొత్తపాలెం లైట్‌ టౌస్‌, మడ అడవుల నుంచి కొందరు పశువులను తరలించుకుని పోతున్నారనే విషయం నా దృష్టికి రాలేదు.

– అవినాష్‌, ఎస్సై, కాట్రేనికోన

కందికుప్ప సమీపంలో ఓ రైతు పొలంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఆవులు (ఫైల్‌)

తీరంలో సంచోరీస్తూ..1
1/2

తీరంలో సంచోరీస్తూ..

తీరంలో సంచోరీస్తూ..2
2/2

తీరంలో సంచోరీస్తూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement