పోలీస్ గ్రీవెన్స్‌కు 51 అర్జీలు
అమలాపురం టౌన్: స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 51 అర్జీలు వచ్చాయి. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా నిర్వహించిన ఈ గ్రీవెన్స్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ఆయా పోలీస్ స్టేషన్లకు చెందిన సీఐ లేదా ఎస్సైతో ఫోన్‌లో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. వచ్చిన అర్జీల్లో ఎక్కువగా ఆస్తి, కుటుంబ తగాదాలకు సంబంధించిన ఫిర్యాదులే ఉండడంతో ఎస్పీ అర్జీదారులతో దాదాపు కౌన్సెలింగ్ తరహాలో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు.
టీచ్‌టూల్ ఓరియెంటేషన్ ప్రారంభం
రాయవరం: జిల్లాలో టీచ్‌టూల్ రెండు రోజుల ఓరియెంటేషన్ ప్రోగ్రామ్ సోమవారం ప్రారంభమైంది. దీనిని రామచంద్రపురం, అమలాపురం, కొత్తపేట డివిజన్ కేంద్రాల పరిధిలో నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 451 మంది శిక్షణ పొందుతున్నట్లు డీఈఓ డాక్టర్ షేక్ సలీం బాషా తెలిపారు. మంగళవారం సాయంత్రంతో శిక్షణ పూర్తవుతుందన్నారు. శిక్షణ పొందిన అబ్జర్వర్లు పాఠశాలలకు వెళ్లి తరగతులను పరిశీలించాల్సి ఉంటుంది. టీచ్‌టూల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్‌ను సమగ్ర శిక్షా ఏఎస్‌పీడీ రవీంద్రనాథ్‌రెడ్డి, టీచ్‌టూల్ స్టేట్ కోఆర్డినేటర్ మాధవీలతలు సందర్శించి, పలు సూచనలు చేశారు.
పాఠశాలకు
రూ.2 లక్షల విరాళం
రాయవరం: స్థానిక శ్రీరామయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు పూర్వ విద్యార్థులు రూ.2 లక్షలు విరాళంగా అందజేశారు. 1973–74లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న సైన్స్ ల్యాబ్ గది పనుల నిమిత్తం ఈ నిధులు ఇచ్చారు. పాఠశాల ఇన్‌చార్జ్ హెచ్‌ఎం పి.ఈశ్వరరెడ్డికి జెడ్పీ మాజీ ప్రతిపక్ష నేత సత్తి రామారెడ్డి చేతుల మీదుగా విరాళాన్ని అందించారు. పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్ దేవిశెట్టి చిన్ని, పూర్వ విద్యార్థులు కొవ్వూరి పుల్లారెడ్డి, ఎంవీ సుబ్రహ్మణ్యం, కొవ్వూరి సత్తిరెడ్డి, జేవీ రామారావు, గొలుగూరి గోవిందరెడ్డి, నల్లమిల్లి రామ్‌గోపాలరెడ్డి, దొంతంశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
పీఆర్ ఇంజినీర్ల
జిల్లా కార్యవర్గం ఎన్నిక
అమలాపురం టౌన్: జిల్లా పంచాయతీరాజ్ (పీఆర్) గ్రాడ్యూయేట్ ఇంజినీర్ల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. స్థానిక పీఆర్ గెస్ట్ హౌస్‌లో పీఆర్ ఇంజినీర్లు సోమవారం సమావేశమై కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. పీఆర్ ఇంజినీర్ల జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిగా రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా బి.దుర్గా కొండలరావు, ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్, పి.సుజాత, ఫైనాన్స్ సెక్రటరీగా పి.సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా ఇరిగేషన్ ఏఈఈ నాయుడు వ్యవహరించారు. నూతన కార్యవర్గ ప్రతినిధులను పీఆర్ ఈఈ పులి రామకృష్ణారెడ్డి, ఏపీపీఆర్ డిప్లామా ఇంజినీర్స్ అసోసియేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్యం రాంబాబు, డీఈఈ పీఎస్ రాజ్‌కుమార్ అభినందించారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు 51 అర్జీలు
పోలీస్ గ్రీవెన్స్‌కు 51 అర్జీలు
పోలీస్ గ్రీవెన్స్‌కు 51 అర్జీలు


