కూటమి ప్రభుత్వంలో భక్తులకు భద్రత కరవు
● వైఎస్సార్ సీపీ నేతల ధ్వజం
● కాశీబుగ్గ మృతుల ఆత్మశాంతికి
కొవ్వొత్తుల ర్యాలీ
అమలాపురం టౌన్: రాష్టంలో ఆలయాలకు వెళ్లే భక్తులకు ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయి రక్షణ చర్యలు చేపట్టలేక చేతులెత్తేస్తోందని ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, నియోజక వర్గాల వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్లు ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో భక్తులకు భద్రత కరువవుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన 9 మంది భక్తుల ఆత్మలకు శాంతి చేకూరాలని జిల్లా వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో అమలాపరంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఈ కొవ్వొత్తుల ర్యాలీలో ఎమ్మెల్సీలతోపాటు ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం నియోజక వర్గాల పార్టీ కో ఆర్డినేటర్లు మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్, డాక్టర్ పినిపే శ్రీకాంత్, గన్నవరపు శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు సీఎం అయిన ప్రతి సారీ తొక్కిసలాటలు అనివార్యమై పదుల సంఖ్యలో భక్తుల మృత్యు వాత పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత పుష్కరాలకు రాజమహేంద్రవరంలో 30 మంది భక్తులు చనిపోతే, ఈ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలో తిరుపతి, సింహాచలం, ఇప్పుడు కాశీబుగ్గలో తొక్కిసలాటలు సంభవించి భక్తుల చనిపోయారని గుర్తుచేశారు. కొవ్వొత్తుల ర్యాలీ హైస్కూలు సెంటర్ నుంచి గడియారం స్తంభం సెంటర్ వరకూ సాగింది. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి బాబి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కర్రి పాపారాయుడు, పితాని బాలకృష్ణ , మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి, మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధికార ప్రతనిధి కాశి మునికుమారి ఎంపీపీ ఇళ్ల శేషగిరిరావు, జెడ్పీటీసీ సభ్యులు పందిరి శ్రీహరి రామగోపాల్, అమలాపురం పట్టణం, పలు మండలాల పార్టీ అధ్యక్షులు సంసాని బులినాని, గుత్తుల చిరంజీవరావు, బద్రి బాబ్జీ, కొనుకు బాపూజీ, నేతలు మట్టపర్తి నాగేంద్ర, గొల్లపల్లి డేవిడ్, మిండగుదటి శిరీష్, సూదా గణపతి, పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సాకా ప్రసన్నకుమార్, పార్టీ ఆర్‌టీఐ విభాగం రాష్ట్ర కార్యదర్శి కోనాల రాజు పాల్గొన్నారు.


