జోగి రమేష్‌ అరెస్ట్‌ దుర్మార్గం | - | Sakshi
Sakshi News home page

జోగి రమేష్‌ అరెస్ట్‌ దుర్మార్గం

Nov 3 2025 6:44 AM | Updated on Nov 3 2025 6:44 AM

జోగి

జోగి రమేష్‌ అరెస్ట్‌ దుర్మార్గం

కాశీబుగ్గ దుర్ఘటన నుంచి దృష్టి మళ్లించే కుట్ర

చిత్తశుద్ధి ఉంటే జోగి రమేష్‌ చాలెంజ్‌ను స్వీకరించాలి

అవసరమైతే లై డిటెక్టర్‌ పరీక్ష చేసుకోవచ్చు

సిట్‌ కాదు సీబీఐ దర్యాప్తు

చేయించుకోండి

కూటమి పాలకులను ప్రజలు

ఛీకొడుతున్నారు

విలేకరులతో ఎమ్మెల్సీ తోట

కపిలేశ్వరపురం (మండపేట): మాజీ మంత్రి, వైఎస్సార్‌ సీపీ నేత జోగి రమేష్‌ను సిట్‌ దర్యాప్తు పేరుతో అరెస్ట్‌ చేయడం అత్యంత దుర్మార్గమని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఖండించారు. కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటన నుంచి ప్రజల దృష్టిని మరల్చే కుట్రలో భాగంగా రమేష్‌ను అరెస్ట్‌ చేశారని అభిప్రాయపడ్డారు. మండపేటలో వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో ఆదివారం పార్టీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి పలివెల సుధాకర్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. పాలనను గాలికి వదలి విపక్ష నేతలపై కుట్రలు పన్నేందుకే కూటమి ప్రభుత్వాధినేతలు ఉత్సాహం చూపుతున్నారన్నారు. కల్తీ మద్యం తయారీ కేసులో కీలక వ్యక్తి జనార్ధన్‌కు ప్రభుత్వాధినేతలే భరోసానిస్తూ విపక్ష నేతల పేర్లను అతనితో చెప్పిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జనార్ధన్‌, తదితరులపై పారదర్శకతతో దర్యాప్తు చేయాలన్నారు. కేసులో నిందితుడు జనార్ధన్‌ వ్యవహార శైలిని పరిశీలించిన వారెవరికై నా ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా కనిపిస్తుందన్నారు. జనార్ధన్‌ ద్వారా జోగి రమేష్‌ కల్తీ మద్యం తయారీకి ప్రధాన కారణమంటూ పేరును చెప్పించారని ఆరోపించారు. అదే వాస్తవమని కూటమి ప్రభుత్వాధినేతలు భావిస్తే ప్రభుత్వం ఏర్పడిన 18 నెలలు కాలంగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కల్తీ మద్యం తయారీతో తనకు ఎలాంటి సంబంధం లేదని జోగి రమేష్‌ అనేకసార్లు చెప్పినా ఉద్దేశ పూర్వకంగా కేసులో ఇరికిస్తున్నారన్నారు. అవసరమైతే తనపై సీబీఐ దర్యాపు చేయించాలని చేసిన చాలెంజ్‌ను ఎందుకు స్వీకరించడం లేదని ఎమ్మెల్సీ తోట ప్రశ్నించారు. సిట్‌ అంటే సిట్‌, స్టాండ్‌ అండే స్టాండ్‌ అనే సిట్‌తో దర్యాప్తు చేయిస్తున్నారన్నారు. తనకు, లోకేష్‌, చంద్రబాబులకు లై డిటెక్టర్‌ పరీక్షలు చేయించమని జోగి రమేష్‌ చాలెంజ్‌ చేశారని గుర్తు చేశారు. పరిపాలించడం చేతకాక, ఇచ్చిన హామీలను అమలు చేయలేక కూటమి ప్రభుత్వం చతికిలపడిందన్నారు. ప్రజల దృష్టి మళ్లించే క్రమంలో విపక్ష నేతలపై కుట్రలు పన్నుతున్నారన్నారు. దుర్మార్గాలు పండే రోజు దగ్గర్లోనే ఉందని, వడ్డీతో సహా చెల్లించుకునే రోజులు వస్తాయన్నారు. విచ్చలవిడిగా మద్యం షాపులకు అనుమతులివ్వడమే కాకుండా బెల్ట్‌ షాపుల ద్వారా నాణ్యత లేని మద్యం విక్రయిస్తున్న సంగతి ప్రజలు గమనిస్తున్నారన్నారు. మద్యాన్ని ఏరులై పారిస్తూ మహిళాలోకానికి అన్యాయం చేస్తున్నది కూటమి ప్రభుత్వమే అన్నారు. జోగి రమేష్‌ను అరెస్ట్‌ చేయడం సిగ్గుమాలిన చర్య అన్నారు. ప్రభుత్వ అసమర్థతను ఎలా సమర్థించుకోవాలో తెలియక జోగి రమేష్‌ను ఇరికించే దుర్మార్గానికి పాల్పడుతున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యర్రగుంట అయ్యప్ప, కౌన్సిలర్‌ మందపల్లి రవికుమార్‌, నియోజకవర్గ ఐటీ వింగ్‌ కన్వీనర్‌ యరమాటి వెంకన్నబాబు, నాయకులు సలాది వీరబాబు, కోళ్ళ శ్రీను పాల్గొన్నారు.

కక్ష సాధింపు చర్య

అల్లవరం: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను డైవర్ట్‌ చేయడానికే మాజీ మంత్రి జోగి రమేష్‌ని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో అరెస్టు చేసిందని మాజీ ఎంపీ, సీఈసీ సభ్యులు చింతా అనురాధ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌, కక్ష సాధింపు చర్యలకు చంద్రబాబు నాయుడు పాల్పడుతున్నారు అనడానికి ఈ అరెస్టే నిదర్శనమని తెలిపారు. నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్‌కు సంబంధం లేకపోయినా బీసీ వర్గానికి చెందిన నాయకుడిని కూటమి సర్కారు లక్ష్యంగా చేసుకుందని అనురాధ విమర్శించారు. ఇప్పటికే విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేసి తన నిర్దోషిత్వాన్ని ప్రజల ముందు జోగి రమేష్‌ నిరూపించారు. అయినప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వం తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈ సమయంలో నకిలీ మద్యం, లిక్కర్‌ మాఫియా వ్యవహారాలు బహిర్గతమయ్యాయి. పట్టుబడ్డవారిలో టీడీపీకి చెందిన నేతలు, అభ్యర్థులు, మంత్రులు, లోకేష్‌కు సన్నిహితులు ఉన్నప్పటికీ, వారిపై ఏ చర్యలూ తీసుకోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని లిక్కర్‌ స్కామ్‌లను సృష్టించి తప్పుడు విచారణలు జరిపి, వైఎస్సార్‌సీపీ నేతలను అక్రమంగా అరెస్ట్‌ చేయడం కూటమి ప్రభుత్వ విధానంగా మారిందని ఆమె పేర్కొన్నారు.

జోగి రమేష్‌ అరెస్ట్‌ దుర్మార్గం1
1/1

జోగి రమేష్‌ అరెస్ట్‌ దుర్మార్గం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement