‘నన్నయ’లో రెజ్లింగ్ పోటీలు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ, ఎన్టీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో రెజ్లింగ్ మెన్ అండ్ ఉమెన్ ఇంటర్ కాలేజీయెట్ కం యూనివర్సిటీ టీమ్ సెలక్షన్స్ సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు యూనివర్సిటీ అనుబంధ కళాశాలల నుంచి 51 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఉమెన్ ఫ్రీ స్టైల్ 50 నుంచి 70 కిలోల కేటగిరీ, మెన్ ఫ్రీ స్టైల్ 57 నుంచి 125 కిలోల కేటగిరీలో పోటీలు జరిగాయి. అలాగే రెజ్లింగ్ గ్రీకో రోమన్ విధానంలో 55 నుంచి 130 కిలోల కేటగిరీ వరకూ నిర్వహించిన పోటీల్లో క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ప్రతిభ చాటిన వారిని యూనివర్సిటీ టీమ్‌గా ఎంపిక చేసి, పంజాబ్‌లోని చండీఘర్ యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ పోటీలకు పంపిస్తామని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ, రిజిస్టార్, స్పోర్ట్సు బోర్డు సెక్రటరీ ఆచార్య కేవీ స్వామి తెలిపారు. ఈ పోటీలకు ఆర్గనైజింగ్ చైర్మన్‌గా ఆచార్య డి.జ్యోతిర్మయి, పరిశీలకులుగా డాక్టర్ బీవీ నరసింహరాజు వ్యవహరించగా, కె.కనకదుర్గ, ఎ.ధర్మేంద్రలు సెలక్షన్ కమిటీ సభ్యులుగా పాల్గొన్నారు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
