బాస్కెట్‌బాల్ పోటీల్లో విజేత రామచంద్రపురం
రామచంద్రపురం: స్థానిక కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో గత నెల 31 నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బాస్కెట్‌బాల్ పోటీలు జరిగాయి. ఇందులో మహిళల విభాగంలో రామచంద్రపురం ప్రథమ, పిఠాపురం ద్వితీయ, కాకినాడ డీఎస్‌ఏ తృతీయ, రాజమహేంద్రవరం సీబీసీ జట్టు నాలుగో స్థానంలో నిలిచాయి.
పురుషుల విభాగంలో రామచంద్రపురం ప్రథమ, కాకినాడ ద్వితీయ, రాజమహేంద్రవరం సీబీసీ తృతీయ, జి.మామిడాడ నాలుగో స్థానాలు సాధించాయి. అనంతరం ఉమ్మడి జిల్లా పురుషుల, మహిళల జట్లను ఎంపిక చేసినట్లు ఏపీ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి.చక్రవర్తి ప్రకటించారు. కాగా ఎంపికై న జట్లు ఈ నెల 7 నుంచి 10 వరకూ విశాఖలో జరిగే 11వ అంతర్ జిల్లాల పోటీల్లో పాల్గొంటాయని అన్నారు. విజేత జట్లను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఏంఎసీ చైర్మన్ రిష్వంత్‌రాయ్ తదితరులు అభినందించారు.


