ఇక అక్రమాలకు చెక్
రాయవరం: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఉపాధి కూలీల ఈకేవైసీ నమోదు ప్రక్రియ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. జాబ్‌కార్డు ఉన్న ప్రతి వ్యక్తి ఆధార్ కార్డు ఆధారంగా ఈకేవైసీ చేసుకుంటేనే నవంబర్ నుంచి ఉపాధి పనులు కల్పించాలని జిల్లా నీటి యాజమాన్య సంస్థ నిర్ణయించింది.
ఇందుకోసం ఎన్‌ఆర్ ఈజీఎస్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఉపాధి కూలీ ఆధార్, ఉపాధి కార్డు వివరాలను నమోదు చేసి కూలీ ఫేస్ (ముఖం)ను గుర్తింపు ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంది. ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్‌లు జాబ్‌కార్డు ఉన్న వారికి ఈకేవైసీ నమోదు ప్రక్రియను చేపడుతున్నారు. అయితే ఉపాధి కూలీలు ఆధార్ కార్డును తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకుని ఉండాలి. ముఖ గుర్తింపు జరగకుంటే ఆధార్‌ను తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ పూర్తిచేయని కూలీలు ఇక నుంచి ఉపాధి పనులు చేసే అవకాశం కోల్పోతారు.
‘ఉపాధి’ హామీలో అవకతవకలు
అరికట్టేందుకు కేంద్రం నిర్ణయం
జాబ్‌కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ
ఈకేవైసీ తప్పనిసరి
లేకుంటే పనిచేసే అవకాశం కోల్పోనున్న కూలీలు
నేషనల్ మొబైల్ మానిటరింగ్ యాప్‌లో రోజూ హాజరు నమోదు
హాజరు పడకుంటే పనికి వెళ్లినా కూలి సొమ్ము జమ కాదు
							ఇక అక్రమాలకు చెక్

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
