నా ఇల్లు కూలిపోయింది
నదిని ఆనుకుని ఉన్న నా ఇల్లు తుపానుకు కూలిపోయింది. గా లులకు తోడు నది నుంచి నీరొచ్చి ముంచేసింది. నేను దివ్యాంగుడిని. నాకున్న ఇబ్బంది వల్ల మా వాళ్లు పునరావాస కేంద్రానికి వెళ్లలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే పరిహారం కోసం మా దగ్గర ఎటువంటి వివరాలూ నమోదు చేసుకోలేదు. కేవలం కేంద్రానికి వచ్చిన వారికి మాత్రమే సొమ్ములిస్తామంటున్నారు. మాకు అన్యాయం చేయవద్దు. మాకు కూడా పరిహారం ఇవ్వాలి.
– వనమాలి పెద్దిరాజు, అంతర్వేది పల్లిపాలెం, సఖినేటిపల్లి మండలం
పది రోజులుగా వేట లేదు
తుపాను వస్తోందంటూ ఈ నెల 22 నుంచి మమ్మల్ని వేటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. పది రోజుల నుంచీ ఇంటి వద్దనే ఉంటున్నాం. వేట లేదు. తుపాను గాలులు, వర్షాల వల్ల మా వలలు దెబ్బతిన్నాయి. వేటకు పోతేనే మా కుటుంబం గడిచేది. మాకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారం అందించలేదు. ప్రస్తుతం పూట గడవడం లేదు.
– ఎరుపల్లి ఏసురాజు, అంతర్వేది పల్లిపాలెం, సఖినేటిపల్లి మండలం
అంతర్వేది పల్లిపాలెంలో కూలిపోయిన ఇంటి వద్ద వస్తువులను సర్దుకుంటున్న పెద్దిరాజు కుటుంబ సభ్యులు
అంతర్వేది పల్లిపాలెంలో దెబ్బతిన్న వలలను సరిచేసుకుంటున్న మత్స్యకారులు
నా ఇల్లు కూలిపోయింది


