డీఐఈవోగా విజయశ్రీ బాధ్యతల స్వీకరణ
అమలాపురం టౌన్: జిల్లా ఇన్‌చార్జి ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ అధికారి (డీఐఈవో)గా డి.విజయశ్రీ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అమలాపురంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోని డీఐఈవో కార్యాలయంలో ఆమె చార్జి తీసుకున్నారు. ఇప్పటి వరకూ డీఐఈవోగా పనిచేసిన వనుము సోమశేఖరరావు శుక్రవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ మేరకు విజయశ్రీని నియమిస్తూ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. విజయశ్రీ తూర్పుగోదావరి జిల్లా ఒకేషనల్ ఎడ్యుకేషన్ అధికారి (డీవీఈవో)గా పనిచేస్తున్నారు. ఆమెకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డీఐఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు.


