యువకుడికి 60 ఏళ్ల జైలు శిక్ష | Sakshi
Sakshi News home page

యువకుడికి 60 ఏళ్ల జైలు శిక్ష

Published Sun, Mar 24 2024 6:07 AM

youth was sentenced to 60 years in prison: Jagityala district - Sakshi

ముగ్గురు బాలికలను వంచించిన ఫలితం 

ఒక్కో కేసులో 20 ఏళ్ల చొప్పున..

మూడు కేసుల్లో కోర్టు సంచలన తీర్పు

జగిత్యాలరూరల్‌: చిన్నారులకు మాయ మాటలు చెప్పి.. అశ్లీల చిత్రాలు చూపించి వంచించిన ఓ యువకుడికి మూడు కేసుల్లో ఒక్కో కేసుకు 20 ఏళ్ల చొప్పున 60 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా సెషన్స్‌ జడ్జి నీలిమ శనివారం సంచలన తీర్పునిచ్చారు. అలాగే బాధిత బాలికలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూరు గ్రామానికి చెందిన కొడిమ్యా­ల హరికృష్ణ అలియాస్‌ హరీశ్‌ (27) గ్రామంలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు.

ఆయన షాపునకు వచ్చే ముగ్గురు బాలికలకు సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడుకోమని ఇచ్చి వారి పక్కన కూర్చుని బూతు వీడియోలు, ఫొటోలు చూపిస్తూ వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు హరీశ్‌పై గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మూడు పోక్సో కేసులు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ ప్రకాశ్, సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్సై శ్రీధర్‌రెడ్డి ఆధారాలు సేకరించి.. కోర్టుకు సమర్పించారు. నేరం రుజువుకా­వడంతో నిందితుడికి ఒక్కో కేసులో 20 ఏళ్ల జైలుశిక్ష­తోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. అలాగే ఒక్కో బాలికకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. మూడు కేసుల్లో శిక్షను ఏకకాలంలో అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement