మరో 20 రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే ఘోరం.. ఆ ఇంట తీవ్ర విషాదం | Sakshi
Sakshi News home page

మరో 20 రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే ఘోరం.. ఆ ఇంట తీవ్ర విషాదం

Published Fri, Jan 27 2023 10:32 AM

Young Man Died In Road Accident In Kurnool District - Sakshi

ఆదోని అర్బన్‌(కర్నూలు జిల్లా): పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువకుడు మృత్యు ఒడి చేరాడు. మరో ఇరవై రోజుల్లో పెళ్లి ఉందనగా.. గుర్తు తెలియని వాహనం రూపంలో మృత్యువు కబళించింది. ఈ దుర్ఘటన గురువారం సాయంత్రం పెద్దహరివాణం గ్రామ సమీపంలో చోటు చేసుకుంది.

తల్లిదండ్రులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎమ్మిగనూరు మండలం గుడికంబాల గ్రామానికి చెందిన హేమాద్రి, రేణుక దంపతుల మొదటి కుమారుడు అరుణ్‌పాండు (24) శిరుగుప్పలోని ఓ ఫర్టిలైజర్స్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. రోజూ లాగే గురువారం కూడా విధులు ముగించుకొని గ్రామానికి వస్తుండగా.. పెద్దహరివాణం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది.
చదవండి: వివాహేతర సంబంధం.. ప్రియుడికి ఊహించని షాక్‌ ఇచ్చిన ప్రియురాలు

దీంతో క్షతగాత్రుడిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో ఆదోని ఏరియా ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. కాగా అరుణ్‌పాండుకు మద్దికెర గ్రామానికి చెందిన ఓ యువతితో పెళ్లి నిశ్చయమైంది. మరో 20 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.      

Advertisement
 
Advertisement
 
Advertisement