యువతి పరిచయం.. భార్యకు విడాకులు ఇచ్చేశానని నమ్మబలికి.. | Young Man Cheating On Woman In The Name Of Marriage In Visakhapatnam | Sakshi
Sakshi News home page

యువతి పరిచయం.. భార్యకు విడాకులు ఇచ్చేశానని నమ్మబలికి..

Feb 22 2022 12:24 PM | Updated on Feb 22 2022 1:45 PM

Young Man Cheating On Woman In The Name Of Marriage In Visakhapatnam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని విశాఖకు చెందిన యువకుడిపై పూణే పోలీసులకు ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేసింది.

సాక్షి, విశాఖపట్నం: తనను వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని విశాఖకు చెందిన యువకుడిపై పూణే పోలీసులకు ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేసింది. బాధితురాలు చెప్పిన వివరాల ప్రకారం.. ఆరేళ్ల క్రితం పూణేలో జర్మనీ లాంగ్వేజ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సదరు యువతికి విశాఖ నగరం మర్రిపాలేనికి చెందిన సుధీర్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అప్పటికే ఆమెకు వివాహమై మూడేళ్లయింది.

చదవండి: సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య.. సహోద్యోగికి ఫోన్‌ చేసి..

తనకూ వివాహమైందని, తన భార్యకు విడాకులు ఇచ్చేశానని నమ్మబలికి ఆమెకు దగ్గరయ్యాడు. ఇప్పుడు ఆమె మూడు నెలల గర్భిణి. ఇదిలా ఉండగా తనను మోసం చేసి రహస్యంగా ఈ నెల 19న సింహాచలంలో మరో యువతిని వివాహం చేసుకున్నాడని బాధిత యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై నగర పోలీసులను సంప్రదించగా.. తమకు ఎటువంటి సమాచారం రాలేదని వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement