మైనర్‌ బాలికపై తండ్రితోపాటు 28 మంది.. ఆరో తరగతి నుంచి..

Uttar Pradesh Minor Girl Alleges Molestation By 28 Men Including Her Father - Sakshi

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో అమానుష ఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తన తండ్రి మరికొంతమందితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడని 17 ఏళ్ల బాలిక మంగళవారం బయటపెట్టింది. అఘాయిత్యం చేసిన వారిలో బీఎస్పీ, ఎస్పీ, జిల్లా ప్రెసిడెంట్‌ కూడా ఉన్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 

ఆరో తరగతి నుంచి తనపై లైంగికదాడి జరుగుతోందని, విషయం బయటకు చెప్తే చంపేస్తామని బెదిరించారని వాపోయింది.  కాగా, బాలిక ఫిర్యాదును స్వీకరించిన లలిత్‌పూర్‌ పోలీసులు నిందితులపై ఐపీసీ, పోక్సో చట్టం సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించామని లలిత్‌పూర్‌ ఎస్పీ తెలిపారు. 
(చదవండి: Uthra Murder Case: కసాయి భర్త కేసులో కోర్టు సంచలన తీర్పు)

ఇదిలాఉండగా.. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని నిందితుల్లో ఒకరైన సమాజ్‌వాది పార్టీ నేత తిలక్‌ యాదవ్‌ మీడియాతో అన్నారు. అసత్య ఆరోపణలతో తమ కాపురంలో చిచ్చుపెడుతున్నారని, ఇది ఇలాగే కొనసాగితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. నిష్పక్షపాత విచారణ జరిపించాలని జిల్లా ఎస్పీ, మెజిస్ట్రేట్‌కు గురువారం మెమొరాండం ఇస్తానని తిలక్‌ యాదవ్‌ చెప్పుకొచ్చారు.
(చదవండి: రెండో పెళ్లి చేసుకున్నాడని తండ్రిని చంపేశాడు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top