ఆమెను చంపి బతికించాలనుకున్నాడు! కానీ, చివరికి..

US Man Stabs A Woman In Her Heart To Bring Her Back To Life - Sakshi

చనిపోయిన వాళ్లను తిరిగి బతికించవ్చనేది అతని నమ్మకం. అందుకోసం ఏకంగా ఒక మహిళను కడతేర్చి జైలుపాలయ్యాడు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే...34 ఏళ్ల స్టీఫెన్‌ జోసెఫ్‌ ఆండర్సన్‌ నవంబర్‌లోని తన ఇంటి పార్క్‌ వద్ద రెబెక్కా లిన్‌ లాంబెర్డ్‌ అనే మహిళను కలిశాడు. ఆ తర్వాత ఆమె కొన్నిరోజులకు శవమై కనిపించింది. అనుకోకుండా ఒక రోజు అధికారులకు ఆండర్స్‌ ఒక చేతిలో కత్తి, మరో చేతిలో సుత్తితో కనిపించాడు. దీంతో వారు అప్రమత్తమై ఆయుధాలను పడేయమని చెప్పి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.

ఐతే అతను మొదట తప్పు దారి పట్టించేలా సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత అతను లాంబెర్డ్‌ అనే మహిళను చంపినట్లు ఒప్పుకున్నాడు. చనిపోయిన వాళ్లను తిరిగి బతికించేందుకు ఆమెను కత్తితో పొడిచి హతమార్చినట్లు చెప్పాడు. ఐతే విచారణ సమయంలోనే అతడు తన తల్లికి ఫోన్‌చేసి పిల్లలను తన బెడ్‌రూమ్‌ వద్దకు పోవద్దని చెప్పినట్లు అధికారుల తెలిపారు.

దీంతో నిందితుడి తల్లిని విచారించగా...ఆమె అతడి బెడ్‌రూమ్‌ వద్ద  ఒక స్త్రీ మృతదేహాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించింది.  ఈ మేరకు పోలీసులు సదరు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని అతనిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడు జైలులో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 

(చదవండి: ఒంటిపై అండర్‌వేర్‌ తప్ప నులుపోగులేదు ..అలానే దొంగలను పరిగెత్తించాడు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top