సూర్యాపేటలో ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా

Travels Bus Rollover At Akupamula In Suryapet District - Sakshi

సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం చేసుకుంది. మునగాల మండలం ఆకుపాముల వద్ద ఓ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కోదాడ ఆస్పత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top