సవతి తల్లి కాదు రాక్షసి | Sakshi
Sakshi News home page

సవతి తల్లి కాదు రాక్షసి

Published Tue, May 21 2024 7:04 AM

three year old girl in karnataka

యశవంతపుర: తల్లి లేని పాపను అమ్మలా చూసుకోవాల్సిన సవతి తల్లి ఈర్ష అసూయతో రాక్షసిలా మారింది. మూడేళ్ల చిన్నారిని కొట్టి చంపిన ఘటన బెళగావి జిల్లా కంగ్రాళి గ్రామంలో జరిగింది. వివరాలు.. సీఆర్‌పీఎఫ్‌లో జవాన్‌గా పని చేస్తున్న రాయణ్ణ మొదటి భార్య గతంలో చనిపోయింది. 

వీరికి ఒక పాప ఉంది. సప్నా అనే యువతిని రాయణ్ణ రెండో పెళ్లి చేసుకున్నాడు. అతడు వేరే రాష్ట్రంలో డ్యూటీలో ఉన్నాడు. ఇంటి వద్ద సప్నా పసిపాపను నిత్యం హింసించేది. ఇదే రీతిలో  సోమవారం కూడా పాపను తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు విడిచింది. పాప వాంతులు చేసుకుంటూ చనిపోయిందని సప్నా నాటకం ఆడింది. ఆమె హత్య చేసిందని పాప అవ్వ, చిన్నాన్న కేసు పెట్టారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement