టీడీపీ బరితెగింపు: మాకే ఎదురు నిలబడతారా..

TDP Leaders Attack YSRCP Activists in Guntur District - Sakshi

పోలింగ్‌ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై దాడులు

సత్తెనపల్లి మండలం ఫణిదంలో దొంగ ఓట్లు వేసేందుకు యత్నం

ఇరువర్గాల మధ్య వాగ్వాదం..

చెదరగొట్టిన పోలీసులు   

సాక్షి, గుంటూరు: తొలి మూడు విడతల పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం, నాలుగో విడత ఎన్నికల్లోనూ ఓటమి తప్పదన్న అక్కసుతో టీడీపీ నాయకులు కుట్రలకు తెరతీశారు. పోలింగ్‌ ప్రక్రియకు విఘాతం కలిగించడంతో పాటు శాంతి భద్రతల సమస్యలు తలెత్తేలా చేసేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. తమకు ఓటు వేయకపోతే అంతు చూస్తామని ఎస్సీ, ఎస్టీ ఓటర్లను బెదిరించడంతో పాటు, దాడులకు తెగబడ్డారు.

వృద్ధుడికి సాయం చేసినందుకు... 
సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామం ఎస్సీ కాలనీలోని పోలింగ్‌ బూత్‌లో నడవడానికి ఇబ్బంది పడుతున్న వృద్ధుడికి వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుడి ఏజెంట్‌గా ఉన్న ఫకీరయ్య సాయం చేయడాన్ని తప్పు బట్టిన టీడీపీ ఏజెంట్లు అతనితో వాగ్వాదానికి దిగారు. కురీ్చతో దాడికి పాల్పడ్డారు. దీంతో ఫీకీరయ్య తరఫు వారు కూడా ప్రతిదాడికి దిగారు. ఈ ఘటనలో ఫకీరయ్య గాయపడ్డాడు. పోలీసులు స్పందించి ఇరువర్గాలను శాంతింపజేశారు. గాయపడిన ఫకీరయ్యను ఆస్పత్రికి తరలించారు.

తమకు ఓటు వేయలేదని దాడి 
పెదకూరపాడు మండలం కంభంపాడు ఎస్సీ కాలనీకి చెందిన దివ్యాంగుడు ప్రభాకర్‌కు సాయంగా అతని సోదరుడు ప్రసన్నకుమార్‌ పోలింగ్‌ బూత్‌కు వెళ్లాడు. ప్రభాకర్‌ స్వయంగా ఓటు వేయడానికి ఇబ్బందిపడటంతో టీడీపీ మద్దతు ఏజెంట్లు ఓటు వేయడానికి వీళ్లేదని అడ్డుకున్నారు. దీంతో ప్రభాకర్‌ను తీసుకుని ప్రసన్నకుమార్‌ పోలింగ్‌ కేంద్రం నుంచి బయటకు వస్తుండగా బాబాయి వరసైన సురేష్‌ విషయం తెలుసుకుని తిరిగి పోలింగ్‌ బూత్‌లోకి తీసుకెళ్లాడు. సురేష్‌ గట్టిగా ప్రశ్నించడంతో ఓటు వేయడానికి పోలింగ్‌ ఆఫీసర్‌ అనుమతించాడు. ప్రభాకర్‌తో ఓటు వేయించి ఇంటికి వెళ్తుండగా టీడీపీ వర్గీయులు వారిని కులం పేరుతో దూషించి, తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తారా అని దాడికి పాల్పడ్డారు. దీంతో సురేష్‌ పెదకూరపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

దొంగ ఓట్లు వేస్తున్నారని ప్రశ్నించినందుకు.. 
సత్తెనపల్లి మండలం ఫణిదంలో టీడీపీ వర్గీయులు దొంగ ఓట్లు వేస్తున్నారని సమాచారం అందడంతో వైఎస్సార్‌ సీపీ వర్గీయులు పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో టీడీపీ వర్గీయులు వాగ్వాదానికి, కవి్వంపు చర్యలకు పాల్పడ్డారు. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. అమరావతి మండలం ఉంగుటూరు పోలింగ్‌ కేంద్రంలోకి టీడీపీ వర్గీయులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశిస్తుండగా వైఎస్సార్‌సీపీ వర్గీయులు అడ్డుకున్నారు. చావపాడులో ఓటు వేయడానికి  ఉంగుటూరు పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసిన 15 మంది రాగా వైఎస్సార్‌ సీపీ వర్గీయులు గుర్తించి అడ్డుకున్నారు. సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు గ్రామంలో పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల లోపు నిబంధనలకు విరుద్ధంగా గుంపులుగా చేరిన టీడీపీ నాయకులను ఇదేంటని ప్రశ్నించిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. ముప్పాళ్ల మండలం మాదలలో కవి్వంపు చర్యలకు పాల్పడ్డారు.

మాకే ఎదురు నిలబడతారా అంటూ దాడి
సత్తెనపల్లి: ‘దళితులు మాకే ఎదురు నిలబతారా?’ అంటూ సత్తెనపల్లి మండలం లక్ష్మీపురంలో  టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. లక్ష్మీపురం పంచాయతీలో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుడు ఆచంట సుబ్బారావు, టీడీపీ మద్దతుదారుడు వల్లెపల్లి శ్రీనివాసరావు పోటీచేశారు. టీడీపీ మద్దతుదారుడు శ్రీనివాసరావు 110 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అంతే టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. రెండు ట్రాక్టర్లతో విజయోత్సవం నిర్వహిస్తూ బాణ సంచా కాల్చారు. దళితుల గృహాల వద్దకు రాగానే ‘మాకే ఎదురు నిలబడతారా, కులం తక్కువోళ్లు మేము చెప్పినట్టు చేయాలి’ అంటూ డీపీకి చెందిన మేడూరి కన్న, మేడూరి రవి, బొద్దులూరి చంద్రశేఖర్, పంచు మర్తి శ్రీనివాసరావు, బొద్దులూరి శేఖర్, బొత్తులూరి శ్రీను, కొర్లకుంట నరేంద్ర, 
బొద్దులూరి అశోక్, కనగాల సందీప్, గోగినేని రామకృష్ణ, అల్లంనేని ప్రసాద్, జి.రమేష్‌, కె.నరేంద్ర, బి.శ్రీను మరో పది మంది కర్రలతో దాడులకు దిగారు. దీంతో ఎస్సీ కాలనీకి చెందిన  నందం వెంకటేశ్వరరావు, నందం సాంబశివరావు, పి.బెంజిమన్, తారా జయమ్మ, కె.సామ్రాజ్యం గాయపడ్డారు. నందం వెంకటేశ్వరరావు, బాధి తులు సత్తెనపల్లి రూరల్‌ పోలీసులకు ఆదివారం రాత్రి ఫిర్యాదు చేశారు.

ఓడిపోయామనే దుగ్ధతో... 
సత్తెనపల్లి మండలం పాకాలపాడులో టీడీపీ మద్దతుదారుడు కె.సాంబయ్యపై వైఎస్సార్‌ సీపీ మద్దతుదారుడు తిప్పిరెడ్డి వెంకటరెడ్డి 353 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అనంతరం వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు గ్రామంలోని వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి 
సంబరాలు చేస్తుండగా టీడీపీ మద్దతుదారుడు సాంబయ్య తాలూకు కొందరు రాళ్లు రువ్వి ఘర్షణకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుడు కె.నర్సిరెడ్డికి గాయాలయ్యాయి. సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు గ్రామాన్ని సందర్శించి ఆందోళనకారులను చెదరగొట్టారు.
చదవండి:
నేనే చూసుకుంటా.. నేతలకు బాబు ఫోన్లు..!  
పుదిపట్లలో దొంగ ఓట్ల ఎఫెక్ట్‌..!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top