నార్సింగిలో విషాదం.. ప్రమాదవశాత్తు బావిలో పడి ఆరేళ్ల బాలుడి మృతి

Six Years Old Boy Died After Fell In Well Narsingi ranga Reddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా నార్సింగిలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు పాడుబడ్డ బావిలో పడి ఆరేళ్ల బాలుడు మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం కిరాణా షాప్‌కు వెళ్లిన బాలుడు బన్నీ..ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు ఇంటి పరిసర ప్రాంతాల్లో వెదికారు.

అయినా బాలుడి ఆచూకీ లభించకపోవడంతో నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెస్క్యూ టీమ్‌ సాయంతో ఓ పాడుబడ్డ బావిలో బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నీళ్లు తోడేసి బాలుడి మృతదేహాన్ని ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు బయటకు తీశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top