కోటి 12 లక్షలు లంచం: అడిషనల్ కలెక్టర్  ఆడియో సంభాషణ

Medak Additional Collector Nagesh Audio Tape Of 1.12 Crore Bribe Demand - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మెదక్‌ జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌ కేసులో తీగ లాగేకొద్దీ డొంక కదులుతోంది. అడిషనల్‌ కలెక్టర్‌ సహా పలువురు రెవెన్యూ సిబ్బంది అరెస్ట్‌కు రంగం సిద్ధం అవుతోంది. ఏసీబీ దర్యాప్తులో అడిషనల్‌ కలెక్టర్‌ మొదలు వీఆర్‌వో స్థాయి వరకూ ఈ కేసులో సంబంధం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం 12ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. భూ వివాదానికి సంబంధించి అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌ రూ.40లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఆడియో టేప్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆడియోలో బాధితుడిని నగేష్‌ లంచం డిమాండ్‌ చేయడమే కాకుండా ఎంత అడిగానో తనకు క్లారిటీ ఉందని చెప్పడం గమనార్హం. మరోవైపు ఆర్డీవో అరుణారెడ్డి నివాసంలోనూ ఏసీబీ సోదాలు ముగిశాయి. ఆమె ఇంట్లో పెద్ద ఎత్తున నగలు, నగదును అధికారులు గుర్తించారు. సోదాలు అనంతరం హైదరాబాద్ ఏసీబి ప్రధాన కార్యాలయంకు తరలించనున్నారు. (ఏసీబీ వలలో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్)

బాధితుడితో అడిషనల్ కలెక్టర్  ఆడియో సంభాషణ

మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారు ఫైనల్ గా, మీకు క్లారిటీ ఉందా 
మీకు క్లారిటీ ఉందా లేదా అనేది కూడా నాకు అర్థం అవ్వడం లేదు - అడిషనల్ కలెక్టర్ 
నాకు క్లారిటీ ఉంది సర్ - బాధితుడు 
మొదటగా 25 లక్షలు ఇస్తాం అన్నారు , ఆ తరువాత 19.5 ఇచ్చారు -  అడిషనల్ కలెక్టర్ 
మీరు డబ్బులు ఎవరెవరికి ఇచ్చారు -  అడిషనల్ కలెక్టర్  
వసీం 5 లక్షలు ఇచ్చాను , మొదటగా రెండు లక్షలు , ఆ తరువాత మూడు లక్షలు ఇచ్చాను -  బాధితుడు
నేను రెండు లక్షలు చెప్పాను కదా, నాకు చెప్పాలి కదా  - అడిషనల్ కలెక్టర్ 
మీకు వసీం కాల్ చేశాను అని చెప్పాడు , అందుకే ఇచ్చాను సర్ - బాధితుడు 
ఎవరికీ ఏమి ఇచ్చిన ప్రతిదీ  నాకు చెప్పాలి కదా -  అడిషనల్ కలెక్టర్
ఐదు లక్షలు ఇవ్వాల్సిన అవసరం లేదు -  అడిషనల్ కలెక్టర్
ఆడియో క్లిప్‌లో డబ్బు లావాదేవీల చర్చతో అడ్డంగా బుక్కైన అధికారి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top