పెళ్లయిన యువతితో యువకుని ప్రేమ వ్యవహారం.. చివరకు..

Married Woman Commits Suicide along with her Boy Friend in Bellary - Sakshi

సాక్షి, బళ్లారి: పెళ్లయిన యువతితో యువకుని ప్రేమ వ్యవహారం తీరని విషాదాంతమైంది. పెద్దల మందలిపుతో విరక్తి చెంది ఇద్దరూ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన దావణగెరె జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.  వివరాలు.. బెంగళూరులో నివాసం ఉంటున్న చరణ్‌ (23), అక్కడే వివాహిత అయిన నాగరత్నతో పరిచయం ఏర్పడి ప్రేమకు దారి తీసింది.

ఈ విషయం నాగరత్న భర్త ప్రసన్నకుమార్‌కు తెలియడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. అయినా వారు తమ గాఢప్రేమను కొనసాగించారు. ఇద్దరూ కలిసి చనిపోదామనుకుని నిర్ణయించుకుని నాలుగు రోజుల క్రితం పల్సర్‌ బైక్‌ తీసుకుని ఇళ్లు వదిలి పారిపోయి వచ్చారు. చరణ్‌ తన స్నేహితునికి ఫోన్‌ చేసి తాము దావణగెరె జిల్లా బెంకికెరె గ్రామ సమీపంలోని చెరువులో దూకి చనిపోతున్నామని చెప్పాడు. ఈ ఘటనపై చెన్నగిరి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చెరువులో నుంచి మృతదేహాలను వెలికి తీశారు.     

చదవండి: (బతుకుపై బెంగనా?.. కుటుంబ సభ్యులు బెదిరించారా..?)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top