Fake Antique Items: నకిలీ పురాతన వస్తువుల పేరుతో దాదాపు రూ.9 కోట్లు కొట్టేశారు!

Man Nearly Rs 9 Crore On The Pretext Of Providing Antique Items - Sakshi

Delhi man duped of Rs 9 crore over fake antique items: ఇంతవరకు మనం రకరకాల చోరీలు గురించి విన్నాం. ఉద్యోగం ఇప్పిస్తానని లేక స్కీం పేరిట అధిక మొత్తంలో మోసాలకు పాల్పడటం గురించి విని ఉంటాం. కానీ ఏకంగా పురాతన వస్తువులను అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు విక్రయిస్తామని చెప్పి ఇద్దరూ దుండగలు కోట్లలో డబ్బును కొట్టేశారు.

అసలు విషయంలోకెళ్తే...ఇద్దరు వ్యక్తులు రేడియో ధార్మిక గుణాలు కలిగిన పురాతన వస్తువులను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు ఎక్కువ ధరకు విక్రయిస్తామనే సాకుతో దాదాపు రూ.9 కోట్ల మోసానికి పాల్పడ్డారు. ఈ నిందుతులను ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం అరెస్టు చేసింది. పైగా ఆ నిందుతులని పోలీసులు ఘజియాబాద్‌కు చెందిన 44 ఏళ్ల అమిత్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన 44 ఏళ్ల గణేష్ ఇంగోల్‌గా గుర్తించారు. ఈమేరకు ఢిల్లీ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఛాయా శర్మ మాట్లాడుతూ..."గౌతమ్‌ పూరి అనే ఆమె  ఫిర్యాదు మేరకు ఆ నిందుతులను అరెస్టు చేశాం.

బాధితురాలితో ఆ నిందుతులు తాము భారత్‌, విదేశీ అంతరిక్ష సంస్థలతో సంబంధం ఉన్నవారిగా పరిచయం చేసుకున్నారు. అంతేకాదు బార్క్, డీఆర్‌డీవో, పురావస్తు శాస్త్రవేత్తలు మాత్రమే పురాతన వస్తువులను తనిఖీ చేయగలరని చెప్పారు. అంతేగాక అంతర్జాతీయ మార్కెట్‌లో పురాతన వస్తువులకు అంగుళానికి రూ 11 కోట్లు వరకు ధర ఉంటుందని బాధితుడికి ఆశ చూపారు. ఈ మేరకు ఆ నిందుతులు రైస్‌ పుల్లర్‌, రేడియోధార్మిక అద్దం, కొన్ని పురాతన వస్తువును చూపించి బాధితుడిని నమ్మించారు.

అయితే తొలుత పురాతన వస్తువును పరీక్షించడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి పెట్టుబడిగా సుమారు రూ.8.93 కోట్లు స్వాహా చేశారు. అంతేకాదు ఆ నగదుని చెక్కు, ఆర్టీజీఎస్, రూపంలో చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పైగా ఆ పురాతన వస్తువులను నాసాకు ప్రపంచవాతావరణ సంస్థకు విక్రయిస్తామని చెప్పారుఅయితే నిందుతుడు గణేష్ ఇంగోలు మెకానికల్ ఇంజనీరింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మాత్రమే కాక ఆరు నెలల పాటు బార్క్ నుండి ప్రాజెక్ట్ శిక్షణ పొందాడం విశేషం. అయితే ఈ చీటింగ్‌ కేసులో మరో ఎనిమిది మంది ఉన్నారని, పైగా వారి పై వివిధ రాష్ట్రాల్లో పలు కేసులు నమోదైయ్యాయి." అని పోలీసులు వెల్లడించారు.

(చదవండి: పోస్ట్‌మార్టం చేయబోతుండగా లేచి కూర్చున్న ఖైదీ! షాక్‌ తిన్న వైద్యులు!!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top