బాలికను బెదిరించి 6 నెలలుగా.. | Man Molested Minor Girl For 6 Months In Prakasam | Sakshi
Sakshi News home page

బాలికను బెదిరించి 6 నెలలుగా..

Sep 1 2020 11:08 AM | Updated on Sep 1 2020 11:31 AM

Man Molested Minor Girl For 6 Months In Prakasam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, ప్రకాశం : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మైనర్‌ బాలికపై బెదిరింపులకు పాల్పడి ఆరు నెలలు అత్యాచారం చేస్తున్నాడో వ్యక్తి. ఈ సంఘటన సింగరాయకొండలో సోమవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాత సింగరాయకొండ బాలిరెడ్డి నగర్‌కు చెందిన యుగందర్ అనే వ్యక్తి తన వద్ద పనిచేస్తున్న 15 సంవత్సరాల బాలికపై బెదిరింపులకు పాల్పడి గత ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ( పొద్దుపొద్దున్నే ఛేజింగ్‌, కాల్పులు )

ఈ నేపథ్యంలో బాలిక అనారోగ్యం పాలైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం అత్యాచారం విషయం వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడు యుగందర్‌, అతడి భార్యపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement