జీన్స్‌ వేసుకోవద్దన్నాడని... భర్తనే కడతేర్చిన మహిళ

 A Man In Jharkhand Stabbed To Death By His Wife Not Wearing Jeans - Sakshi

ఇటీవల కాలంలో చాలాచిన్న చిన్న విషయాలే ఘోర తప్పిదాలుగా కనిపిస్తున్నాయి. సామరస్య పూర్వకంగా మాట్లాడుకుని పరిష్కారించుకునే దిశగా ఆలోచించడం మాని ప్రాణాలు తీసుకునేంత కోపాలు తెచ్చుకుంటున్నారు. చివరికి ఇరు జీవితాలను నాశనం చేసుకుని కుటుంబికులకు తీరని విషాదాన్ని మిగుల్చుతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక మహిళ ఘోరమైన దారుణానికి ఒడిగట్టింది.

వివరాల్లోకెళ్తే...జార్ఘండ్‌కి చెందిన ఒక జంట గోపాల్‌పూర్‌ గ్రామంలో జరిగే జాతర చూసేందుకు వెళ్లింది. ఐతే ఆ జాతర చూసి ఇంటికి తిరిగి వచ్చాక భార్యభర్తలిద్దరూ తీవ్ర స్థాయిలో గొడవపడ్డారు. ఇంతకీ ఆ దపంతులకు గొడవకు కారణం జీన్స్‌ వస్తధారణ. ఆమె జీన్స్‌ ధరించి జాతరకు వచ్చిందని ఆమెను దూషించడం మొదలు పెట్టాడు భర్త.  అయినా పెళ్లి తర్వాత మహిళలు జీన్స్‌ ధరించకూడదంటూ భార్యతో తీవ్ర స్థాయిలో గొడవపడ్డాడు.

భర్త తీరుకి కోపంతో ఊగిపోయిన అతడి భార్య కత్తి తీసుకుని అతని పై దాడి చేసింది. దీంతో వెంటనే అతడి కుటుంబసభ్యులు హుటాహటినా ఆస్పత్రికి తరలించారు. అయితే బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు బాధితుడి తండ్రి కర్ణేశ్వర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. జీన్స్‌ విషయంలో కొడుకు కోడలు మధ్య వాగ్వాదం వచ్చిందని, ఆ కోపంలోనే తన కోడలు కొడుకుని చంపేసిందని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించారు. 

(చదవండి: జస్టిస్‌ ఫర్‌ శ్రీమతి: టీచర్లు హరిప్రియ, కృతిక అరెస్ట్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top