12 మంది యువతులకు లైంగిక వేధింపులు.. ఇంజనీర్‌ అరెస్ట్‌

Man Arrest For Molested 12 Women Used Matrimonial Sites To Lure Them - Sakshi

ముంబై:  బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఒక మెకానికల్‌ ఇంజనీర్‌ తప్పుబాటను ఎంచుకున్నాడు. పెళ్లి పేరుతో మాట్రియోనియల్‌ సైట్లలో నకిలీ  ప్రొఫైల్స్‌ను క్రియేట్‌ చేసి యువతులను ఆకర్షించి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. అలా 12 మంది యువతులను వేధించిన మహేష్‌ అలియాస్‌ కరణ్‌ గుప్తాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు.. ముంబైలోని మలాద్‌ ప్రాంతానికి చెందిన మహేష్ ఉన్నత విద్యావంతులైన యువతులను ఆకర్షించేందుకు మ్యాట్రిమోనియల్ సైట్లలో నకిలీ ప్రొఫైల్ లను సృష్టించాడు. మ్యాట్రిమోనియల్ సైట్ల ద్వారా యువతులతో సన్నిహితంగా మెలుగుతూ వారిని ఫోన్లలో సంప్రదించి పబ్, రెస్టారెంట్లు,షాపింగ్ మాల్స్ లలో సమావేశం అయ్యేవాడు. మొదట వారితో చనువుగా ఉంటూ వారి ఫోన్‌ నెంబర్లను సంపాదించేవాడు. అనంతరం లైంగిక వేధింపులకు గురి చేసేవాడు.

ఇదే విషయమై డీసీపీ సురేష్ మెన్ గేడ్ మాట్లాడుతూ.. ప్రతీసారి నేరానికి పాల్పడే ముందు కొత్త మొబైల్ నంబరును ఉపయోగించేవాడు. ప్రతీసారి తన సిమ్‌ను మార్చుకుంటూ ఓలా లేదా ఉబెర్ ఉపయోగించి క్యాబ్‌లను బుక్ చేసేవాడు. పైగా అతను ఉపయోగించే సిమ్‌లన్ని తన పేరిట ఉండ‍కుండా జాగ్రత్తలు తీసుకునేవాడు.  గతంలో హ్యాకర్ గా పనిచేసిన మహేష్ కంప్యూటర్లపై మంచి పరిజ్ఞానం ఉంది. కానీ మహేష్‌ దానిని తప్పడు మార్గంలో ఉపయోగిస్తున్నాడు.'' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నిందితుడు మహేష్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు డీసీపీ తెలిపారు. 
చదవండి: ఆన్‌లైన్‌ పోర్న్‌ సినిమాలకు బానిసై.. విపరీత చేష్టలు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top